సంక్రాంతికి కేబినెట్ విస్తరణ.. ఆసక్తికర విషయమేంటంటే..

సంక్రాంతికి కేబినెట్ విస్తరణ.. ఆసక్తికర విషయమేంటంటే..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు నెల అవుతోంది. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఇది సంక్రాంతి తర్వాత కానీ.. ముందు కానీ ఉండవచ్చని టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 12 మంది మంత్రులుండగా.. మరో ఆరుగురి చేరికకు అవకాశముంది. సీఎం పదవి కోసమే కాంగ్రెస్‌లో ఎంతో మంది నేతలు ఎదురు చూశారు. ఇక మంత్రి పదవి కోసం పదుల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు.

ఆసక్తికర విషయమేంటంటే.. దాదాపు 3 కేబినెట్ పదవులను రేవంత్ పక్కనబెడతారట. బీఆర్ఎస్, బీజేపీల నుంచి వచ్చే నేతల కోసం వీటిని హోల్డ్‌లో పెట్టనున్నారట. అవి కాక ఇక మిగిలేది 3 పదవులు. దీనికోసం సీనియర్ లీడర్లంతా పోటీ పడుతున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌కు కాస్త పైనే మాత్రమే ఉన్నారు. ఈ తరుణంలో ఇద్దరు ముగ్గురిని ఇతర పార్టీల నుంచి లాగకుంటే ఎలాగైనా భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు కాస్త కష్టమే.

నలుగురు అటు ఇటు అయ్యారో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. అలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకే ఒక మూడు స్థానాలను బీజేపీ, బీఆర్ఎస్‌ల నుంచి వచ్చే నేతల కోసం కాంగ్రెస్ అట్టిపెట్టనుందని టాక్. ప్రస్తుతం టాక్ అయితే బీఆర్ఎస్, బీజేపీల నుంచి దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. దీన్ని పక్కనబెడితే ఈ నెల 3న కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ మీటింగ్ ఉంటుందట. ఈ సమావేశాం తర్వాత కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.