పవన్‌పై కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోర్టు

పవన్‌పై కేసు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కోర్టు

వలంటీర్లు వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే వలంటీర్ వ్యవస్థకు పరువు నష్టం కలిగేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్‌ కల్యాణ్‌పై విజయవాడ సివిల్ కోర్టులో ఓ ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. దానిని విజయవాడ సిటీ సివిల్‌ కోర్టు రిటర్న్ చేసింది.

ఈ వ్యవహారంపై విచారణ జరిపే భౌగోళిక విచారణాధికారం తమ కోర్టు పరిధిలోకి ఎలా వస్తుందనేది స్పష్టత ఇవ్వాలని సివిల్ కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిర్దిష్టంగా ఫిర్యాదురాలి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయనేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని సూచించింది.

Pawan Kalyan in Eluru

కాగా.. విజయవాడకు శాంతినగర్‌కు చెందిన ఏలూరులో రంగవల్లి అనే మహిళా వాలంటీరు విజయవాడ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌/ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు పై విధంగా సూచనలు చేసింది.

ఏలూరు వారాహి యాత్ర సభలో వలంటీర్ల ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పవన్‌ను ఐపీసీ సెక్షన్‌ 500 (పరువునష్టం కలిగించినందుకు శిక్ష), 504, 505 తదితర సెక్షన్ల కింద శిక్షించాలని రంగవల్లి కోరారు. మొత్తానికి ఈ కేసులో కోర్టు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.