ఏపీలోని మూడు పార్టీలకూ ఈ ఎన్నికలు డూ ఆర్ డై..
ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం ఆరాటపడుతున్నాయి. అవేంటంటే.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు. వైసీపీ సోలోగానే ఎన్నికల బరిలో దిగుతుంటే.. టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఒక్క జనసేన మినహా రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. బీజేపీని పక్కనబెడితే మిగిలిన మూడు పార్టీలకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై సిట్యువేషన్‌నే కల్పిస్తున్నాయి.
వైసీపీకి ఈ ఎన్నికల్లో గెలవక తప్పని పరిస్థితి. ఒకవేళ టీడీపీ, జనసేనలు కలిశాయో వైసీపీకి చాలా కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అధినేత జగన్‌ను ఈ రెండు పార్టీలు ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తాయని టాక్. పైగా సోలోగా పోటీ చేసి కూడా గెలిస్తే పార్టీకి అది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ పార్టీని వైఎస్ వివేకా హత్యతో పాటు సొంత చెల్లి, బాబాయి కూతురు కొంత మేర విజయానికి అవరోధాలుగా మారారు.
ఇక టీడీపీ, జనసేన విషయానికి వస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే 70 ఏళ్లు పైబడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలవకుంటే మరో ఐదేళ్లు విజయం కోసం వెయిట్ చేయాల్సిందే. అప్పటికి మరింత వయసు మీద పడుతుంది. పైగా ఈయనకు కూడా స్కిల్ కేసు వంటివి ఎన్నికల్లో గెలవకుంటే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. ఇక జనసేన ఓటమి పాలైతే ఇక నిలదొక్కుకోవడం కష్టమే. పవన్ నాయకత్వంపై నమ్మకం సడులుతుంది. ఈ రెండు పార్టీల విజయానికి అభ్యర్థుల ఎంపిక అవరోధంగా మారుతోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..