నిరుపేదలు, వృద్ధులపైనా చంద్రబాబు ప్రతాపం?
నిరుపేదలు, వయసుమళ్లిన వారి పట్ల ఎవరైనా కాస్త దయతో వ్యవహరిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం పదే పదే తమ అక్కసును వెళ్లగక్కుతుంటారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమమే అజెండాగా దూసుకెళుతున్నారు. దీనిలో భాగంగానే చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి తద్వారా సంక్షేమ పథకాలన్నీ అర్హుల ఇళ్లకే చేరేలా చూస్తున్నారు. అయితే సంక్షేమం అంటేనే గట్టని చంద్రబాబు.. జగన్ చేస్తున్న సంక్షేమాన్ని సహించలేకపోతున్నారు.
ప్రతినెలా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచే వలంటీర్ల కాళ్లకు కోర్టుల సాయంతో ఇప్పటికే బంధనాలు వేసి చంద్రబాబు తాను గెలిచానని సంబర పడుతున్నారు. అయితే దీని కారణంగా నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు జరుగుతున్న నష్టాన్ని మాత్రం గ్రహించడం లేదు. అసలే వేసవి కాలం.. 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. ఇలాంటి సమయంలో వారు బయటకు వచ్చి పెన్షన్.. ఇతరత్రా పథకాలు అందుకోవాలంటే చాలా కష్టం. వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చంద్రబాబు చేసిన పనికి వృద్ధులు.. వికలాంగులు.. మండిపడుతున్నారు.
అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా చంద్రబాబుకు ఎలాగూ చేతకాదు.. కనీసం జగన్ చేస్తున్న మంచిని సైతం ఈసీ సాయంతో ఇలా అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు పెరిగినా.. బుద్ధి పెరగలేదంటూ శాపనార్థాలు పెడుతున్నారు.చంద్రబాబు చేసిన ఈ పని ఆయన నిరుపేదలకు ఎంత వ్యతిరేకమో తెలియజేస్తోందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.పేదలమీద గెలిచానని చంద్రబాబు సంబరపడుతున్నారు కానీ జూదంలో గెలిచినా కౌరవులు కురుక్షేత్రంలో ఓడిపోయారనే విషయాన్ని జనం గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇప్పుడు కోర్టుల్లో గెలిచినా రేపు ఎన్నికల్లో ఓటమి ఖాయమని అంటున్నారు. తామంతా కలిసి పక్కాగా ఓడిస్తామని పెన్షనర్లు చెబుతున్నారు.