చంద్రబాబు ఎప్పటికీ మారడా? ఇంకెంత కాలం దళితులపై ద్వేషం?

దళితులపట్ల చంద్రబాబు ద్వేషం

దళితులుగా పుట్టాలనో లేదంటే ఉన్నత వర్గంలో జన్మించాలనో ఎవరూ స్కెచ్ గీసుకుని మరీ జన్మించరు. దళితులు, ఉన్నత వర్గాల భావన ఇటీవలి కాలంలో చాలా వరకూ లేదనే చెప్పాలి. అది కూడా రాజకీయాల్లో ఉన్న వారికి అసలు ఆ భావనే మనసులోకి కూడా రాకూడదు. అటువంటిది టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ భావన మాత్రం ఎప్పటికీ పోయేలా కనిపిచడం లేదు. చంద్రబాబు చేసిన కామెంటే దీనికి నిదర్శనం. ఇప్పటికీ ఆయన దళిత, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం ఏమాత్రం ఇష్టం లేనట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన సమయం దొరికినప్పుడల్లా దళితులను అవమానిస్తూన ఉంటారు.

అసలేం జరిగిందంటే..

సింగనమల టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు…మడకశిరకు ఉపాధిహామీ కూలీ లక్కప్పను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. నిమ్న వర్గాలు, అత్యంత సాధారణ జనాలను చట్టసభలకు పంపడం ఎంత ముఖ్యమనేది ఇప్పటికే ఏపీ సీఎం జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గతంలో అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ జగన్ పేద వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. దీన్ని కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు. ఒక టిప్పర్ డ్రైవరుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? హేళనగా మాట్లాడుతున్నారు.

Ys Jagan With Mla Cadidate

చంద్రబాబు వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు. దీనిపై దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.చంద్రబాబేమో సుజనా చౌదరి… సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టిక్కెట్లు ఇస్తే.. జగన్ మాత్రం సాధారణ వ్యక్తులను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి వీరాంజనేయులు మంచి విద్యావంతుడు. ఆయన ఎం ఏ , బీఈడీ చదివారు. అయితే చంద్రబాబు ఇప్పటికే మూడుసార్లు సీఎం అయ్యారు. కానీ ఉద్యోగావకాశాలు మాత్రం కల్పించలేకపోయారు. దీంతో వీరాంజనేయులు కుటుంబ పోషణార్థం టిప్పర్ డ్రైవర్ గా పని చేయాల్సి వచ్చింది. చంద్రబాబు కన్నా ఆయనకు విద్యార్హతలు ఎక్కువే ఉన్నా కూడా ఉద్యోగం అయితే లభించలేదు. అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో ఇబ్బంది కలిగించక తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆయా వర్గాల నుంచి తప్పక వ్యతిరేకతను అయితే ఎదుర్కోవాల్సిందేనని చెబుతున్నారు.

Google News