ప్రచార హోరును సాగిస్తున్న పార్టీలు.. మరి గెలుపెవరిది?

ప్రచార హోరును సాగిస్తున్న పార్టీలు.. మరి గెలుపెవరిది?

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. పార్టీల అధినేతలంతా జిల్లాల పర్యటన ముమ్మరం చేశారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జగన్ అనంతపురంలోకి  సీఎం జగన్‌ బస్సు యాత్ర నేడు ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. జగన్ యాత్రకు జనం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు కడప జిల్లా ప్రొద్దుటూరులోప్రజాగళంబహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభకు సైతం ఆయన ప్లాన్ చేశారు. అనంతరం చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సైతం జనం భారీగానే తరలి వస్తున్నారు. పార్టీలో టికెట్ లొల్లి పలు చోట్ల నడుస్తున్నా కూడా వాటన్నింటినీ పక్కనబెట్టి చంద్రబాబు ప్రచారంలో దూసుకెళుతున్నారు.

Advertisement

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగి వారాహి యాత్రను చేపట్టారు. పిఠాపురంలో నేడు ఆయన యాత్ర జరగనుంది. నేటి సాయంత్రం పిఠాపురంలో పవన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరును అయితే కొనసాగిస్తున్నాయి. అన్ని పార్టీలకు జనం భారీగానే వస్తుండటంతో అసలు ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలన్నీ గెలుపుపై భారీగానే ఆశలు పెట్టుకున్నాయి కానీ సభలకు వచ్చే జనాన్ని చూసి అయితే గెలుపును అంచనా వేయలేం. ఇక చూడాలి.. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో.