బీఆర్ఎస్‌లో కల్లోలం.. పార్టీని వీడుతున్న ఎంపీ అభ్యర్థులు
లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా వరకూ తప్పుకోవడం పార్టీలో కల్లోలం రేపుతోంది. అధికారం లేకపోవడమో.. లేదంటే ఒకరు జంప్ అవుతున్నారని మరొకరు జంపవుతున్నారో కానీ ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ అగ్ర నేతలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు. తాజాగా బీఆర్ఎస్ టికెట్ పొందిన ఓ అభ్యర్థి సైతం పార్టీని వీడటం సంచలనంగా మారింది.
అసలు పార్టీ టికెట్ కోసమే దాదాపు నేతలెవరూ పెద్దగా ముందుకు రాలేదు. పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పోటీకి వెనుకడుగు వేస్తున్నారని అప్పట్లో టాక్ నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసినా గెలవకుంటే ఏంటి పరిస్థితి అని నేతలు ఎవరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ముందుకు రాలేదట. ఇక ఎలాగో పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించేసింది. ప్రకటించిన తర్వాత కూడా నేతలు పార్టీని వీడుతున్నారు.
చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి హస్తం పార్టీలో చేరారు. తాజాగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమెతో పాటు ఆమె తండ్రి కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక కావ్యతో పాటు నామినేషన్ల నాటికి మరికొంతమంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారని తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తోంది.
ఉందేది ఎవరో..పోయేది ఎవరో తెలియక బీఆర్ఎస్‌లో అయోమయం నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ కే కేశరావు సైతం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన నేడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేపు కాంగ్రెస్‌లో చేరనున్నారు.