చంద్రబాబుపై మండిపడుతున్న కేడర్.. ఎక్కడికక్కడ నేతల రాజీనామాలు..

చంద్రబాబుపై మండిపడుతున్న కేడర్.. ఎక్కడికక్కడ నేతల రాజీనామాలు..

టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. పార్టీ అధికారంలో లేకున్నా సరే.. ఇంతకాలం కాడి మోసిన నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు మొండి చేయి చూపించడంతో కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. పైగా చంద్రబాబు డబ్బులు తీసుకుని తమ పార్టీకి చెందిన కీలక నేతలను పక్కనబెట్టి వేరే నేతలకు టికెట్లు ఇవ్వడం మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో శ్రమిస్తున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. దీంతోచంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్‌ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

ఇక గుంతకల్ నియోజకవర్గంలోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. నారా చంద్రబాబునాయుడు రూ.150 కోట్లు తీసుకుని నియోజకవర్గం నాయకులకు కాదని పక్క నియోజకవర్గ నాయకులకు టికెట్ ఇచ్చారంటూ గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అనుచరులు, కార్యకర్తలు ఫైర్ అయ్యారు. ఆగ్రహంతో చంద్రబాబు నాయుడు ఫోటోని మంటల్లో వేసి కాల్చివేశారు.

చంద్రబాబుపై మండిపడుతున్న కేడర్.. ఎక్కడికక్కడ నేతల రాజీనామాలు..

దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విజయనగరంలోనూ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. టీడీపీ తుది జాబితాలో ఏజెన్సీ నేతలకు చంద్రబాబు మొండి చేయి చూపించారు. ‘రా కదలిరా’ సభలో దన్ను దొరకు టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆయన తన నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నారు.

చంద్రబాబుపై మండిపడుతున్న కేడర్.. ఎక్కడికక్కడ నేతల రాజీనామాలు..

అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. ఇక విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష పదవికి, చీపురపల్లి ఇన్ ఛార్జ్ పదవికి కిమిడి నాగార్జున రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాచీపురపల్లి టిక్కెట్ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కేటాయించకపోవటంతో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆగ్రహంతో టీడీపీ కార్యకర్తలు ప్రచార సామగ్రిని దగ్ధం చేశారు.

చంద్రబాబుపై మండిపడుతున్న కేడర్.. ఎక్కడికక్కడ నేతల రాజీనామాలు..

అలాగే నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ కర్రోతు బంగార్రాజుకి పార్టీ తీరని ద్రోహం చేసిందని పోలిపల్లిలో టీడీపీ కార్యకర్తలు విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నాలుగు మండలాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మొత్తానికి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం టీడీపీని కుదిపేస్తోంది.

Google News