ఆ ప్రాంతాలపై పట్టు బిగిస్తున్న వైఎస్ జగన్

ఆ ప్రాంతాలపై పట్టు బిగిస్తున్న వైఎస్ జగన్

ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగింది. పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ కూడా వ్యూహాలకు పదును పెట్టి మరీ రంగంలోకి దిగారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు వైసీపీకి కొంత మేర టఫ్ అనే చెప్పాలి. అందుకే ముందుగా జగన్ తమ బలంతో పాటు బలహీనతలను అంచనా వేసుకున్నట్టు సమాచారం.  ఈ క్రమంలోనే ఎక్కువగా ఏ ఏ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలనే విషయాన్ని కూడా ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుగా పెద్ద ఎత్తున జగన్ అభ్యర్థులనైతే మార్చేశారు. ఈ పార్టీకి రాయలసీమలో బాగా పట్టుంది. ఈ క్రమంలోనే అక్కడ పట్టు ఏమాత్రం తగ్గకుండా స్కెచ్ అయితే గీసుకున్నారు. ఇక తమకు కాస్త పట్టు తక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన స్థానాలతో పాటు తమ పార్టీ విజయం సాధించిన స్థానాలను మూడు వర్గాలుగా విభజించినట్టు సమాచారం.

Advertisement

ఒకటి వచ్చేసి గత ఎన్నికల్లో వైసీపీ పదివేలకు పైన మెజారిటీ సాధించిన స్థానాలు.. రెండోది 10 వేల నుంచి 5 వేల మెజారిటీ మధ్య విజయం సాధించిన స్థానాలు.. మూడోది 5 వేల లోపు విజయం సాధించిన స్థానాలుగా విభజించారు. ముఖ్యంగా జగన్.. పైన చెప్పిన రెండు, మూడు వర్గాలపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఐదు వేల లోపు మెజారిటీ సాధించిన స్థానాలు 12 ఉన్నాయి. అలాగే 10 వేల నుంచి 5 వేల లోపు మెజారిటీ సాధించిన స్థానాలు 44 ఉన్నాయి. ఈసారి వీటిపై పట్టు కోల్పోతే పార్టీ ఓటమి ఖాయం.  అందుకే ఈ ప్రాంతాలపై జగన్ పట్టు బిగిస్తున్నారని టాక్.