టీడీపీ, జనసేన ఖాళీ… వైఎస్సార్పీలోకి భారీ చేరికలు

Tdpysrcp Kha


సరిగ్గా ఎన్నికలు 45 రోజుల ముందు తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం మొదలు పెట్టారు. వీస్తున్న గాలికి సంకేతం అన్నట్లు అనేక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి షాక్ ఇస్తూ ఆ కూటమి నేతలు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలోకి వచ్చారు.

విజయవాడ

విజయవాడకు చెందిన బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి), గండూరి మహేష్, నందెపు జగదీష్‌ (మాజీ కార్పొరేటర్లు), కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్‌ మెంబర్‌), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సెక్రటరీ, గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్‌ అధ్యక్షులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

విశాఖ పట్నం

వై.ఎస్ జగన్ అగైన్ అనే నినాదంతో విశాఖపట్నంకు జి.వి.రవిరాజు (సీనియర్‌ నాయకులు), బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు) వైఎస్సారెస్పీలోకి వచ్చారు.

Tdpysrcp Kha2

సూళ్లూరుపేట, వెంకటగిరి, రాజంపేట, ఏలూరులో టీడీపీ ఖాళీ!

సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి కూడా జగన్ కే జై కొట్టారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

వెంకటగిరి నియోజకవర్గంలో తెదేపా ఖాళీ అవుతోంది. వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజంపేట టీడీపీ ఎంపీ ఇంఛార్జి గంటా నరహరి, నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య, టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇంఛార్జ్‌ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి (పాయకరావుపేట) కూడా ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణం చేసేందుకు వచ్చారు.

జైభారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర కూడా జగన్ కి జై కొట్టారు.

Google News