ఎమ్మెల్సీ కవితకు షాక్.. తిహార్ జైలుకు..

ఎమ్మెల్సీ కవితకు షాక్.. తిహార్ జైలుకు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు.14 రోజులు కవితకు ఢిల్లీ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టు జ్యూడీషల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకూ జ్యూడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆమెను నేడు  రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవిత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె విచారణ దాదాపు ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది.

లిక్కర్ కేసుకు సబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా.. తన కుమారుడికి పరీక్షల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 16 వ తేదీ వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు. అయితే దీనిపై విచారణను కోర్టు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

కాగా.. ఎమ్మెల్సీ కవిత నేడు రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. దీనికి ముందు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ కోర్టుకు వచ్చారు. తాను కడిగిన ముత్యంలా తాను ఈ కేసు నుంచి బయటకు వస్తానని తెలిపారు. తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని కవిత అన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు జీజేపీలో జాయిన్ అవగా… మరొకరు టికెట్ ఆశిస్తున్నారని.. ఇంకొకరు ఎలక్ట్రోల్ రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని కవిత తెలిపారు.