రఘురామ పచ్చి అబద్ధాలు.. నివ్వెరపోయే పది నిజాలివే..

రఘురామ పచ్చి అబద్ధాలు.. నివ్వెరపోయే పది నిజాలివే..

ఆంధ్ర్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఐదేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రాను ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే టీడీపీ కూటమి రావణకాష్టంగా, మరో బీహార్‌లా తయారు చేసింది. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ఇంతకీ హోం మంత్రి ఉన్నారా..? అనే సందేహాలు సామాన్యుడి నోట కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే దర్శనమిస్తున్నాయి. ఓ వైపు టీడీపీ కార్యకర్తలు, నేతలు అరచకాలు.. మరోవైపు డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనెట్టి నారా లోకేష్ తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా, మీడియాలో ఎక్కడ చూసినా ఏపీలో జరుగుతున్న అరాచకాలే కనిపిస్తున్నాయ్. ఈ క్రమంలో ఇప్పటి వరకూ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడిక ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వంతు వచ్చింది. ఈయన్ను రంగంలోకి దిగి పచ్చి అబద్ధాలను.. అసలు ఏ మాత్రం నిజాల్లేని విషయాలతో డ్రామాలు ఆడటం గమనార్హం.

రఘురామ హైడ్రామా!

2021 మే-14 న జరిగిన ఘటనకు సంబంధించి రఘురామ గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. సీఐడీ, ఐబీ మాజీ చీఫ్‌లు సునీల్‌కుమార్‌, పీఎస్‌ఆర్‌.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇందులో ఏ-1గా సునీల్‌, ఏ-2గా పీఎస్‌ఆర్‌, ఏ-3గా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. నాటి అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతిపైనా కేసు నమోదైంది. గుంటూరు సీఐడీ ఆఫీసులో రఘురామపై థర్డ్‌ డిగ్రీతో పాటు.. బైపాస్‌ సర్జరీ జరిగిందన్నా వినకుండా గుండెలపై కూర్చున్నారని.. బెల్టు, లాఠీలతో కొట్టి చంపే యత్నం చేశారని నగరంపాలెం పోలీసులకు మెయిల్‌లో రఘురామ ఫిర్యాదు చేశారు.

పచ్చి అబద్ధమే..!

ఏపీలో కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ర‌చించిన రాజ్యాంగం కాకుండా నారా లోకేష్ త‌యారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మ‌రోసారి అక్షరాలా నిరూపిత‌మైంది. తాజాగా.. హైకోర్టు, సుప్రీం కోర్టు మూడేళ్ల క్రితం తోసిపుచ్చిన ఆరోప‌ణ‌ల ఆధారంగా కూట‌మి ప్రభుత్వం త‌ప్పుడు కేసు న‌మోదు చేయ‌డమే అందుకు తాజా నిద‌ర్శనం. త‌న‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పోలీసులు కుమ్మక్కై అక్రమంగా అరెస్ట్ చేసి క‌స్టోడియ‌ల్ టార్చర్‌, హ‌త్య ప్రయ‌త్నం చేశార‌ని నాటి ర‌ఘు రామ‌కృష్ణ రాజు చేస్తున్న ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్తవం. వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  1. స‌మాజంలో వ‌ర్గ విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతూ శాంతి భ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్న కె.ర‌ఘురామ‌కృష్ణ రాజును సీఐడీ అధికారులు 2021 మే నెల‌లో కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.
  2. త‌న‌ను కొట్టార‌ని, హింసించార‌ని ఆరోపిస్తూ దానిపై రాఘురామ‌కృష్ణ రాజు విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేర‌కు గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డాక్టర్ ప్రభావ‌తి నేతృత్వంలో న‌లుగురు వైద్యుల బృందం ర‌ఘురామ‌కు వైద్య ప‌రీక్లు నిర్వహించి, ఎక్స్ రే, స్కాన్లు తీసింది.
  3. ర‌ఘురామ శ‌రీరంపై ఎలాంటి గాయాలు లేవ‌ని.. సీఐడీ అధికారులు క‌స్టడీలో అత‌నిని శారీర‌కంగా హింసించ‌లేద‌ని నిర్ధారించి అదే విష‌యాన్ని హైకోర్టుకు నివేదించింది.
  4. ఒక‌వేళ ర‌ఘురామ కృష్ణ రాజు ఆరోపిస్తున్నట్లు త‌న‌ను సీఐడీ అధికారులు కొట్టి ఉంటే అవి ఎక్స్ రే, స్కాన్ రిపోర్టుల్లో బ‌య‌ట ప‌డేవి. అలాంటివేమీ లేవ‌ని డాక్టర్ల బృందం రిపోర్టు ఇచ్చింది.
  5. అంతే కాదు ర‌ఘురామ కృష్ణ రాజుకు రెండు రోజులు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య ప‌రీక్షలు నిర్వహించగా ఆ వైద్య ప‌రీక్షల్లోనూ ఆయ‌న‌ను పోలీసులు కొట్టిన‌ట్లు వెల్ల‌డికాలేదు.
  6. ర‌ఘురామ‌కృష్ణ రాజు చేస్తున్న ఆరోప‌ణ‌ల ఆధారంగా బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించ‌గా, అదే ఆరోప‌ణ‌ల ఆధారంగా సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించేందుకు సుప్రీం కోర్టు సైతం తిర‌స్క‌రించింది.
  7. మూడేళ్ల క్రితం చేసిన‌ ర‌ఘురామ కృష్ణ రాజు ఆరోప‌ణ‌లు ఏకంగా హైకోర్టు, సుప్రీం కోర్టు తోసిపుచ్చగా.. తాజాగా అధికారం చేప‌ట్టిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించేందుకు బ‌రి తెగించింది.
  8. నాడు న్యాయ‌స్థానాలు తోసిపుచ్చిన ఆరోప‌ణ‌ల‌తోనే ర‌ఘురామ‌రాజు మూడేళ్ల త‌ర్వాత మెయిల్‌లో ఫిర్యాదు చేయ‌డం.. ఆ వెనువెంట‌నే ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్‌, పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, నాటి గుంటూరు జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ప్రభావ‌తిల‌తో పాటు మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై కేసులు న‌మోదు చేశారు.
  9. చంద్రబాబు ప్రభుత్వ చ‌ర్య క‌క్ష సాధింపే కాదు.. కోర్టు ధిక్కార‌మేన‌ని ప‌లువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
  10. ఏదైనా కేసులో 77 రోజుల త‌ర్వాత సాక్షుల‌ను విచారించ‌డం స‌రికాద‌ని సుప్రీం కోర్టు గ‌తంలోనే తీర్పు చెప్పినా.. మూడేళ్ల త‌ర్వాత చంద్రబాబు ప్రభుత్వం కేసు న‌మోదు చేయ‌డం విస్మయ‌ప‌రుస్తోంద‌ని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చూశారుగా.. రఘురామ చెప్పిన పచ్చి అబద్ధాలకు, నివ్వెరపోయే నిజాలు ఇవే. ఇప్పుడు చెప్పండి హైడ్రామా ఎలా ఉందో.. ఇకనైనా నోరు తెరిచి నాడు ఏం జరిగిందో నిజాలు చెప్పి తెలుగు ప్రజలకు.. దర్యాప్తు సంస్థలకు క్షమాపణ చెబితే మంచిదని సామాన్యుడి నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్.
Google News