నారా లోకేష్ ఎక్కడ.. ఏమైపోయారు?

నారా లోకేష్ ఎక్కడ.. ఏమైపోయారు?

ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మహా అయితే మరో పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ అలెర్ట్ అయిపోయాయి. నిత్యం జనాల్లో ఉంటూనే అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేయగా.. టీడీపీ, జనసేనలు తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితాల్లో పేర్లున్న వారందరూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమయ్యారు?

నారా లోకేష్ ఇటీవలి కాలంలో జరిగిన రెండు పెద్ద కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేనలు ఇటీవల తొలి జాబితాను ప్రకటించాయి. ఈ కార్యక్రమానికి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలంతా హాజరయ్యారు కానీ నారా లోకేష్ మాత్రం రాలేదు. ఆ వేదికపై లోకేష్ కనిపించకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ తరువాత తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేనలు కలిసి ఉమ్మడిగా ఓ భారీ సభను నిర్వహించారు. ఈ వేదికపై కూడా లోకేష్ కనిపించలేదు.

అసలు ఇటీవలి కాలంలో లోకేష్ ఏమయ్యారని టీడీపీ కార్యకర్తలు సైతం చర్చించుకుంటున్నారు. ఇంతటి కీలక వేదికలపై కనిపించకపోవడంతో పలు అనుమానాలకు కారణమవుతోంది. సొంత కుమారుడితో పార్టీని నడపడం కష్టమని టీడీపీ అధినేత చంద్రబాబే లోకేష్‌ను దూరం పెట్టారా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. కనీసం తనకు కేటాయించిన మంగళగిరి నియోజకవర్గంలో సైతం లోకేష్ పర్యటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పార్టీలో నారా లోకేష్ ప్రమేయం ఎక్కవవుతోందన్న కంప్లైట్స్ రావడంతో ఆయన్ను చంద్రబాబే సైడ్ చేసేసి ఉంటారని కూడా టాక్ నడుస్తోంది.

Google News