పవన్‌పై ఎవరిని పోటీకి పెట్టాలి? వైసీపీలో టెన్షన్.. టెన్షన్

పవన్‌పై ఎవరిని పోటీకి పెట్టాలి? వైసీపీలో టెన్షన్.. టెన్షన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై దాదాపు స్పష్టత వచ్చినట్టేనని తెలుస్తోంది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయడం ఫిక్స్ అట. తొలుత పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా జనసేన ప్రకటించిన తొలి జాబితాలో పవన్ తన పేరును ప్రకటించలేదు. దీంతో భీమవరం ఫిక్స్ కాదనే నిర్ణయానికి అంతా వచ్చారు. విస్తృత కసరత్తు తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట.

ప్రస్తుతం పవన్ పోటీ చేసే స్థానంపై దాదాపు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక అక్కడ ఎవరిని బరిలోకి దింపాలా? అని వైసీపీ బీభత్సంగా టెన్షన్ ఫీలవుతోందట. ఎవరైనా సరే.. పవన్‌ను కొట్టే నేతను మాత్రమే నిలబెట్టాలని యోచిస్తోందట. ఈ క్రమంలోనే వంగా గీతను కూడా మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారట. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను ఇన్‌చార్జిగా జగన్ నియమించారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి పవన్ పోటీ చేయబోతున్నారన్న టాక్‌తో ఆమెను కూడా మార్చేశారని సమాచారం.

Advertisement

ఇక పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడను దింపితే వైసీపీకి ఢోకా ఉండదని అధినేత భావిస్తున్నారట. వైసీపీపై అలిగి తిరిగి జనసేనకు దగ్గరవ్వాలని ముద్రగడ భావించారు. అయితే పవన్ తనను కలిసేందుకు వస్తానని రెండు సార్లు చెప్పి కలవకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనొక ఘాటు లేఖను పవన్‌కు రాశారు. జనసేనలో చేరే ఆలోచనను కూడా ముద్రగడ విరమించుకున్నారని తెలుస్తోంది. ఈక్రమంలోనే వైసీపీ ఆయనతో మాట్లాడి పవన్‌పై పోటీకి దింపాలని యోచిస్తోందట. ఇక చూడాలి ఏం జరుగుతుందో..