వై నాట్ 175..! సర్వేలతో క్లారిటీ వచ్చేసిందిగా..!

వై నాట్ 175..! సర్వేలతో క్లారిటీ వచ్చేసిందిగా..!

గత కొన్ని రోజులుగా సీఎం వైఎస్ జగన్ చెబుతున్న మాట రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేంటంటే.. వై నాట్ 175..! 2019లో వైసీపీ అనూహ్యంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టనన్ని పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకాలకు సంబంధించి అర్హతను ప్రామాణికంగా తీసుకుని లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీల్లో దాదాపు 99 శాతం అమలు పరిచారు. దీంతో జగన్ పాలనపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు వైసీపీని ఆదరిస్తున్నారు.

బలంగా వై నాట్ 175 అనే నినాదాన్ని పార్టీ శ్రేణుల్లోకి

సంక్షేమాన్ని దాదాపు ప్రతి పేద కుటుంబానికి చేరువ చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చిన నేపథ్యంలో ఈ సారి 175 స్థానాలను సాధించడం పక్కా అని సీఎం జగన్ పార్టీ నాయకులకు చెబుతూ వస్తున్నారు. ఇది జరిగితే ప్రజలకు మరింత సంక్షేమం అందించవచ్చని చెబుతున్నారు. అందుకే వై నాట్ 175 అనే నినాదాన్ని పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళుతున్నారు. అయితే ఇన్నాళ్లు జగన్ అంటున్న మాటలను తేలిగ్గా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలకు సర్వేలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ఈ మాటను ఊరికే అనలేదని.. ఆయన తలచుకుంటే ఇదొక పెద్ద విషయం కాదని సర్వేలు నిరూపిస్తున్నాయి.`

వై నాట్ 175..! సర్వేలతో క్లారిటీ వచ్చేసిందిగా..!

టైమ్స్ నౌ సంస్థ సర్వేతో క్లారిటీ

రెండు నెలల క్రితం టైమ్స్ నౌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 22 – 23 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. ఇక ప్రస్తుతం అదే టైమ్స్ గ్రూప్ కి చెందిన టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన జన్ గన్ కా మన్ సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైయస్సార్సీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుస్తుందని స్పష్టమైంది. ప్రతిపక్ష టీడీపీ కేవలం 0-1 స్థానాలకే పరిమితం అవుతుందని తేలింది.

Ys Jagan Times Now Survey 2

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొన్న సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజల్లో నమ్మకం పెంచుకోవడం ఒక కారణమైతే.. చంద్రబాబుని మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడం మరో కారణం. వెరసి అన్నీ సర్వేల్లోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 175 కి 175 స్థానాల్లో గెలుపొందడం పెద్ద కష్టం కాదని, వై నాట్ 175 అంటున్న వైఎస్ జగన్ ఆ లక్ష్యాన్ని చేరుకోగలరని స్పష్టమవుతోంది.

Google News