తెలంగాణ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పిస్తారా?

తెలంగాణ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పిస్తారా?

ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కీలక సమావేశం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీజేపీ తెలంగాణ చీఫ్‌గా బండి సంజయ్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది తేలనుంది. ఇప్పటి వరకూ బండి సంజయ్‌ను కొనసాగిస్తారా? లేదా? అనేది తెలంగాణలో హాట్ టాపిక్‌గా నడిచింది. ఆయననుతొలగించి తెలంగాణ చీఫ్ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగిస్తారని కూడా టాక్ నడిచింది. మరోవైపు అదేమీ లేదంటూ పలువురు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే నేడు ఈ సమావేశానికి ముందే బీజేపీ తెలంగాణ నేత, మాజీ మంత్రి విజయరామారావు మీడియాతో మాట్లాడారు.

బండి సంజయ్‌ను తెలంగాణ చీఫ్ పదవి నుంచి తొలగిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. బండి‌ సంజయ్‌ను మార్చితే బీజేపీలో చేరికలు కాదు.. ఉన్న వారు బయటకు పోవటం ఖాయమన్నారు. మొత్తానికి బండి సంజయ్‌ను మారిస్తే మాత్రం తెలంగాణలో బీజేపీ రెండు వర్గాలుగా విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సమావేశంలో బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ బిఎల్ సంతోష్ పాల్గొన్నారు. ముఖ్యంగా మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలుగు రాష్ట్రాలు సహా ఐదు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

Google News