బీజేపీ సీనియర్ల మధ్య ముదురుతున్న వివాదం..

బీజేపీ సీనియర్ల మధ్య ముదురుతున్న వివాదం.. 

బీజేపీ సీనియర్ల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. నిన్న బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి(Jithender Reddy) ఆ పార్టీ తెలంగాణ నాయకత్వానికి ఒక వీడియో ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు.

నిన్న ఈటల రాజేందర్(Etela Rajendar) మీడియాతో మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో ఆయనకే తెలియాలన్నారు. అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని.. ఏదీ పడితే అది మాట్లాడకూడదని.. ఎవరి గౌరవానికీ భంగం కలగకుండా చూసుకోవాలన్నారు. ఎవరి స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని ఈటల హితవు పలికారు.

నిన్న జితేందర్‌ రెడ్డి(Jithender Reddy) వచ్చేసి.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ట్రీట్‌మెంట్ అవసరమని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా హాట్ టాపిక్‌గా మారింది. జితేందర్ రెడ్డి అసంతృప్తి ఏ స్థాయికి చేరుకుందనేది ఆ వీడియో చూస్తే అర్ధమవుతుంది.అసలు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలో ఎక్కించడానికి ట్రై చేస్తుంటాడు. అది ఎంతకీ ఎక్కకుంటే వాటి సీటుపై ఒక్క తన్ను తంతాడు. ఆ దున్నపోతు వెంటనే ట్రాలీ ఎక్కుతుంది. ఈ వీడియో షేర్ చేసిన జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సేమ్ ట్రీట్‌మెంట్ అవసరమన్నారు. అంతేకాదు.. ఈ ట్వీట్‌ను అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి అగ్రనేతలకు ట్యాగ్‌ చేశారు.

Google News