వైసీపీ 3వ జాబితాలో స్థానం పొందిన నేతలెవరంటే..!

వైసీపీ 3వ జాబితాలో స్థానం పొందిన నేతలెవరంటే..!

వైసీపీ మూడో లిస్ట్‌పైనే ఏపీ సీఎం జగన్ తన ఫోకస్ అంతా పెట్టారు. పూర్తి స్థాయి సమయాన్ని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో లిస్ట్ కోసమే వెచ్చిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడవ జాబితా సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఒక మంచి ముహూర్తం చూసి ఈ జాబితాను విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ రెండు జాబితాల్లో తమ స్థానం గల్లంతైన నేతలు చాలా వరకూ పార్టీకి రివర్స్ అవుతున్నారు. అలాగే కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ సైతం పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలోనే జగన్ మూడో లిస్ట్ విడుదల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. నేడు అమావాస్య కావడంతో రేపు ఉదయం వైసీపీ మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఇద్దరికి ఎంపీల జాబితాలోచోటు లభించినట్టు సమాచారం. ఇక మూడో జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం…

ఎంపీ జాబితా..

విజయనగరం – బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు

వైజాగ్ – బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స జాన్సీ

కర్నూలు – మంత్రి జయారాం

ఎమ్మెల్యే జాబితా

పెందుర్తి –  గుడివాడ అమర్నాథ్

చింతలపూడి – విజయరాజ్

రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి

మార్కాపురం – జంకే వెంకటరెడ్డి

నందికొట్కూరు – లబ్బివెంకటస్వామి/ డాక్టర్ సుధీర్

గూడురు – మేరుగ మురళి/ ఆర్డీవో కిరణ్‌ కుమార్

చిత్తూరు – విజయానంద రెడ్డి

పూతలపట్టు – మాజీ ఎమ్మెల్యే సునీల్‌ 

Google News