‘వై నాట్ 175’ లక్ష్యంగా రంగంలోకి జగన్..

Ys Jagan Y Not 175

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఇటీవలి కాలంలో తరచుగా వినబడుతున్న మాట ‘వై నాట్ 175’. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి ఉంటోంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ సర్వేలు చేయించి ఆ రిపోర్టులకు అనుగుణంగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలా చోట్ల ప్రజా బలం లేని సిట్టింగులను నిర్మొహమాటంగా పక్కనబెట్టేశారు. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలను వైఎస్ జగన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక జగన్ తదుపరి కార్యాచరణలోకి దిగారు. ఇక మీదట కేడర్‌తో మీటింగ్‌లను నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. దీనికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని 5 రీజియన్‌లలో కేడర్ మీటింగ్‌లను జగన్ నిర్వహించబోతున్నారు. వారికి ఆయనే స్వయంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. 4-6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించడం జరుగుతుంది.

Ys Jagan Y Not 175 2

ఈ సమావేశాల ముఖ్య లక్ష్యం వచ్చేసి కేడర్ మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి వారందరినీ ఏకం చేయడం. అలాగే వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175 /175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడం. ఈ క్రమంలోనే తొలి సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ అంతా సిద్ధమై పోయింది. మొదటి సమావేశం జనవరి 25న విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. ఈ సమావేశానికి 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. 

Google News