టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ.. వ్యాపార సంస్థ: రాయపాటి రంగారావు

టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ.. వ్యాపార సంస్థ: రాయపాటి రంగారావు

టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రాజధాని ప్రాంతంలో వరుసబెట్టి కీలక నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేయగా.. తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు.స్టేట్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రంగారావు ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. 

అనంతరం తెలుగుదేశం పార్టీపై రాయపాటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదని..అదొక దిక్కుమాలిన పార్టీ అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా ఆయన అభివర్ణించారు. తమ కుటుంబాన్నే ఈ పార్టీ సర్వనాశనం చేసిందన్నారు. గత ఎన్నికల్లో 150 కోట్లు తమ నుంచి వసూలు చేశారని రంగారావు ఆరోపించారు. తమ వద్ద నుంచి చంద్రబాబు ఎంత తీసుకున్నారనే దానికి లెక్కలు కూడా ఉన్నాయన్నారు.

టీడీపీ ఒక దిక్కుమాలిన పార్టీ.. వ్యాపార సంస్థ: రాయపాటి రంగారావు

మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తానని.. ఆయనను ఓడించి తీరుతానని రంగారావు సవాల్ విసిరారు. కియా కంపెనీని తానే తెచ్చాననే చంద్రబాబు మరి రాయలసీమలో పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు. గతంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎక్కడ పని చెయ్యనిచ్చారని నిలదీశారు. కన్నా లక్ష్మీనారాయణ ఒకే కులానికి పని చేస్తారని.. తాము అన్ని కులాలకూ పని చేస్తామని రాయపాటి తెలిపారు. రాజీనామా లేఖను పంపిన అనంతరం రాయపాటి తన ఆఫీసులోకి చంద్రబాబు పోటోను నెలకేసి కొట్టి పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Google News