దళితులంటే చంద్రబాబుకు ఇంత చులకనా ?.. దళిత సంఘాల ఆగ్రహం

దళితులంటే చంద్రబాబుకు ఇంత చులకనా ?.. దళిత సంఘాల ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు దళితుల పట్ల మాటల్లో ఎక్కడ లేని ప్రేమనంతా కురిపిస్తారు. కానీ చేతల విషయానికి వచ్చేసరికి అదేమీ ఉండదు. వాళ్ల విషయంలో ఎంతో దూరంగా ఉంటారు. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది. తాజాగా కూడా చంద్రబాబు దళితుల విషయంలో ఎలా వ్యవహరిస్తారేనది మీడియా సాక్షిగా బట్టబయలైంది. గడిచిన ఐదేళ్లలో దళితుల పట్ల ఆయన వైఖరి మారిందేమో అనుకున్నాం కానీ అది కూడా జరగలేదు.

తాజాగా చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నాని నివాసంలో ఆతిథ్యం తీసుకున్నారు. చంద్రబాబు కేసు త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారిలో నాలుగుసార్లు ఎమ్యెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన దళిత నేత పరసరత్నం కూడా ఉన్నారు.

దళితులంటే చంద్రబాబుకు ఇంత చులకనా ?.. దళిత సంఘాల ఆగ్రహం

ముఖ్య నేతలంతా ప్రెస్ ముందు కూర్చోగా.. పరసరత్నం మాత్రం చంద్రబాబు వెనుక నిలబడ్డారు. ఇది చూసిన పరసరత్నం అనుచరులు మండిపడుతున్నారు. తమ నాయకుడు దళితుడు కాబట్టే చంద్రబాబు ఇలా చేశారని.. అసలు దళితుల పట్ల ఆయనకు ఇంకా చులకన భావం పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులందరూ ఈ విషయాన్ని గమనించి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని దళిత సంఘాల నేతలు పిలుపునిస్తున్నారు.