వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్
మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ కన్నడ సినిమా గిల్లి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా 2009లో విడులైంది. ఆ తరువాత కెరటం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా కూడా బ్రేక్ వచ్చింది మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. అందానికి అభినయం కూడా తోడవడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.
ఆ తరువాత ఈ ముద్దగుమ్మ తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ అవకాశాలు కొట్టేసింది. బాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవలి కాలంలో అమ్మడికి అవకాశాలు అసలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు, బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లికి సిద్ధమైంది. రేపు గోవాలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తన జర్నీని ఒక ఇంటర్వ్యూలో రకుల్ గుర్తు చేసుకుంది.
తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాటి నుంచి 25 ఏళ్లు వచ్చే వరకూ తనకు తన తల్లి తోడుగా నిలిచారని తెలిపింది. తన కెరియర్ మోడలింగ్‌తోనే ప్రారంభమైందని వెల్లడించింది. తన తొలి రెమ్యూనరేషన్ రూ.5 వేలు అని చెప్పింది. తను ఈ స్థాయికి రావడానికి కారణం.. తన తల్లిదండ్రులు, స్నేహితులు మాత్రమేనని రకుల్ తెలిపింది. తన వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చేదని రకుల్ వెల్లడించింది.