వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

మోడలింగ్‌తో కెరీర్‌ను మొదలు పెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ కన్నడ సినిమా గిల్లి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా 2009లో విడులైంది. ఆ తరువాత కెరటం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా కూడా బ్రేక్ వచ్చింది మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. అందానికి అభినయం కూడా తోడవడంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.

ఆ తరువాత ఈ ముద్దగుమ్మ తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోనూ అవకాశాలు కొట్టేసింది. బాలీవుడ్‌లో సైతం ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవలి కాలంలో అమ్మడికి అవకాశాలు అసలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు, బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లికి సిద్ధమైంది. రేపు గోవాలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తన జర్నీని ఒక ఇంటర్వ్యూలో రకుల్ గుర్తు చేసుకుంది.

Advertisement
వాళ్లు లేకుంటే నేను ఎన్నో సమస్యలు ఫేస్ చేసేదాన్ని: రకుల్

తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాటి నుంచి 25 ఏళ్లు వచ్చే వరకూ తనకు తన తల్లి తోడుగా నిలిచారని తెలిపింది. తన కెరియర్ మోడలింగ్‌తోనే ప్రారంభమైందని వెల్లడించింది. తన తొలి రెమ్యూనరేషన్ రూ.5 వేలు అని చెప్పింది. తను ఈ స్థాయికి రావడానికి కారణం.. తన తల్లిదండ్రులు, స్నేహితులు మాత్రమేనని రకుల్ తెలిపింది.  తన వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్‌ చేయాల్సి వచ్చేదని రకుల్ వెల్లడించింది.