రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

రకుల్, జాకీ భగ్నానీల ఆస్తుల విలువెంతో తెలిస్తే..

హీరోయిన్ రకుల్ ప్రీత్ వివాహం నేడు జరగనుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కబోతోంది. గోవాలో ఈకో ఫ్రెండ్లీ పద్ధతిలో జరగనున్న ఈ వివాహం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. ఇదంతా ఒక ఎత్తేతే.. ప్రస్తుతం వీరిద్దరి ఆస్తులకు సంబంధించిన వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. కరోనా టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2021 అక్టోబర్‌లో రకుల్, జాకీల జంట తమ ప్రేమ విషయాన్ని ప్రకటించేసింది.

రకుల్ ఆస్తులు, జాకీ భగ్నానీ ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రకుల్‌కు హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక కార్ల విషయానికి వస్తే అన్నీ లగ్జరీ కార్లే ఆమె వద్ద ఉన్నాయి. రూ.2.96 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600.. రూ.కోటి మెర్సిడెజ్ బెంజ్, రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.75 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 520డీ, రూ.35 లక్షల విలువైన ఆడీ క్యూ3  కార్లున్నాయి. ఓవరాల్‌గా ఈమె దగ్గర అధికారిక లెక్కల ప్రకారమైతే రూ.49 కోట్లు విలువైన ఆస్తి ఉందట.

Advertisement

మరోవైపు రకుల్ కాబోయే భర్త జాకీ భగ్నానీ ఆస్తుల విషయానికొస్తే.. రూ.2.39 కోట్ల విలువైన రేంజ్ రోవల్ వాగ్.. రూ.2.11 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్.. రూ.1.36 కోట్ల విలువైన పోర్స్ కేయన్ని,  రూ.84 లక్షల విలువైన మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్ కార్లు ఉన్నాయి. పలు స్థిరాస్తులతో కలిపి ఓవరాల్‌గా జాకీ భగ్నానీ దగ్గర అధికారిక లెక్కల ప్రకారం రూ.35 కోట్ల విలువైన ఆస్తి ఉందట. ఇలా ఇద్దరి దగ్గర కలిపి రూ.84 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం.