యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

యాంకరింగ్‌లో సుమది నాలుగో స్థానమా? తొలి మూడు స్థానాల్లో ఎవరంటే..

సుమ కనకాల తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు. యాంకర్‌గా ఆమె తన హవాను రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె జోరు అయితే తగ్గింది. సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా సరే దాదాపుగా సుమే చేస్తుంటుంది. అయితే బుల్లితెరపై మాత్రం ఆమె వెనుకబడి పోయింది. గతంలో ఉన్నంత క్రేజ్ అయితే ఇప్పుడు లేదు.

తాజాగా యాంకరింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారనే విషయమై ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది. మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ తెలుగుపై చేసిన సర్వేలో యాంకరింగ్‌లో ప్రదీప్ మాచిరాజు టాప్‌లో నిలిచాడు. చాలా కాలం తర్వాత మేల్ యాంకర్స్ హవా కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. మూడో స్థానంలో హైపర్ ఆది ఉన్నాడు.

ఇక యాంకర్ సుమ నాలుగో స్థానంలో ఉంది. పై ముగ్గురూ వారి కామెడీ టైమింగ్‌తో దూసుకెళుతున్నారు. సుమ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది కానీ వీరంత అయితే కాదనే చెప్పాలి. ఇక ఐదవ స్థానంలో చమ్మక్ చంద్ర నిలిచాడు. చంద్ర బుల్లితెరపై ఇటీవలి కాలంలో పెద్దగా కనిపించడం లేదు. అయినా సరే టాప్ 5ను దక్కించుకున్నాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు అయితే సుమ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇంతకాలం పాటు టాప్‌లో ఉండటమంటే మాటలు కాదు.

Google News