యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

యాక్టివ్ అయిన సమంత.. ఆ విషయంలో గిల్టీ ఫీలైందట..

స్టార్ హీరోయిన్ సమంత తిరిగి యాక్టివ్ అయిపోయింది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి ఆమె క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే తన అనుభావాలతో పాటు మయోసైటిస్‌పై అవగాహన కలిగించేందుకు ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించారు. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ నిన్న ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్స్‌పర్ట్స్‌తో వెల్‌నెస్ కంటెంట్‌ను అందించనున్నట్టు సమంత తెలిపింది.

తొలి ఎపిసోడ్‌లో భాగంగా సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రిషనిస్ట్‌ అల్కేశ్‌ సమాధానాలిచ్చారు. తాను మంచి ఆహారం తింటున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని.. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు తమ దరిచేరవని చాలా మంది భావిస్తూ ఉంటారు. తాను కూడా గతంలో ఇదే జాబితాలో ఉండేదాన్నని సామ్ తెలిపింది. దీనికి తాను గిల్టీ ఫీలయ్యానని వెల్లడించింది. తాను కూడా పొద్దునే లేచి, వర్కౌట్స్‌ చేసేదాన్నని.. ఆరోగ్యకరమైన ఆహారం తినేదాన్నని.. మనస్ఫూర్తిగా నవ్వేదాన్నని తెలిపింది. దీనికి తీవ్ర ఒత్తిడి కారణమంటారా? అని ప్రశించింది.

Advertisement

సమంత అడిగిన ప్రశ్నకు అల్కేశ్ సమాధానమిస్తూ.. తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు అన్నీ ఆటో ఇమ్యూన్‌కు కారకాలేనని తెలిపారు. ఆటో ఇమ్యూన్‌కు గురైనప్పుడు మంచి నిద్ర అవసరమని పేర్కొన్నారు. ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్నా మెదడు వృత్తిపర/వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది అప్పటికీ ఓకే అయినా భవిష్యత్తులో ఎఫెక్ట్‌ పడుతుందన్నారు. ఆటో ఇమ్యూన్‌కు ఆధునిక జీవనశైలి దీనికి ప్రధాన కారణమన్నారు. మొత్తానికి సామ్ అయితే ఈ వ్యాధి గురించి జనాల్లో అవేర్‌నెస్ తీసుకురావడానికి గట్టిగానే ట్రై చేస్తోంది.