టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: మళ్ళీ జగనే

Timesnowexitpollap

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇప్పటికే పలు సర్వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికార పగ్గాలు చేపడుతారు అని తేల్చేశాయి. ఆ ఖాతాలో మరో బిగ్ ఎగ్జిట్ పోల్ … జగన్ కే జై అనేసింది.

టైమ్స్ నౌ – ETG రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మొత్తం లోక్ సభ సీట్లు: 25

వైఎస్సారెస్పీకి దక్కేవి: 14
తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి: 11
కాంగ్రెస్: 0

ఇక అధికారవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 50 శాతం ఓటు షేర్ ని దక్కించుకోనుంది అని తేల్చింది ఈ సర్వే. లోక్ సభ సీట్ల అంచనా బట్టి చూస్తే అసెంబ్లీ సీట్లు కూడా అదే రేషియోలో ఉండొచ్చు. అంటే వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కుర్చీలో దర్జాగా కూర్చోబోతున్నారు. “జగన్ అనే నేను” అని మరోసారి గర్జించనున్నారు.

Google News