జగన్‌ను చూసి ఫుల్ ధీమాలో వైసీపీ శ్రేణులు

జగన్‌ను చూసి ఫుల్ ధీమాలో వైసీపీ శ్రేణులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. లండన్ నుంచి జగన్ దంపతులు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ ,మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , వెలంపల్లి శ్రీనివాసరావు, కైలే అనీల్ కుమార్ , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నడూ లేని విధంగా జగన్‌ను కలిసేందుకు ఇంత మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎయిర్‌పోర్టుకు రావడం విశేషం.

Ys Jagan Returns

140 సీట్లతో వైసీపీ విజయం ఫిక్స్..

ఎన్నికలు అయిన నాటి నుంచే కాదు.. ఎన్నికల ముందు నుంచి కూడా ఈసారి తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ పూర్తి ధీమాలో ఉన్నారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వైనా 175 అనే నినాదంపై ఎన్నికల వరకూ నిలబడి ఉంటారు? ఇప్పుడు అన్ని సీట్లు రాకున్నా కూడా దాదాపు 140 సీట్లతో వైసీపీ విజయం సాధించడం పక్కా అనే ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ వేదికగా ప్రమాణం ఉంటుందని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సైతం ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. సమయం కూడా ఫిక్స్ చేశారు. వైసీపీ నేతలంతా ఫలితాల కోసం కంటే ప్రమాణ స్వీకారం చేసే డేట్ అయిన 9వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెప్పిన మాటపై నిలబడి ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.

జగన్‌ను చూసి ఫుల్ ధీమాలో వైసీపీ శ్రేణులు

ప్రశాంత సముద్రంలా జగన్..

పోలింగ్ తర్వాత ఐప్యాక్ టీంతో జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. వారికి కంగ్రాట్స్ కూడా చెప్పారు. ఆ రోజున జగన్ చాలా ఆనందంగా కనిపించారు. ఆ తర్వాత ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌లోనూ జగన్ పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌కి ముందు కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు కూడా విదేశీ పర్యటన నుంచి జగన్ తిరిగి వచ్చారు. తుఫాన్ ముందు ప్రశాంతంగా ఉండే సముద్రం లాగా జగన్ కనిపిస్తున్నారు. మరో చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 4 న మళ్లీ జగన్ చరిత్రలు తిరగరాయనున్నారు. చాలా ప్రశాంతంగా .. ఎప్పటీ లాగే నవ్వుతూ జగన్ కనిపించడంతో కేడర్‌లోనూ బీభత్సమైన ధీమా వచ్చేసింది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్.. మెయిన్ ఫలితాలు కాదు.. కేవలం జగన్ మొహం చూసి వైసీపీ శ్రేణులు కావల్సినంత ధీమాలో ఉన్నాయి.

Google News