సర్వేలన్నీ వైసీపీకే పట్టం.. జయహో జగన్!!

సర్వేలన్నీ వైసీపీకే పట్టం.. జయహో జగన్!!

ఎన్ని సర్వేలు వచ్చినా సరే గెలుపు వైసీపీదే..! వరుసగా రెండోసారి వైఎస్ జగన్‌దే సీఎం పీఠం అని తేల్చేశాయ్..! ఒక్కడు ఒకే ఒక్కడు కేంద్రంలోని ఎన్డీఏ రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీని.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబును.. జనసైన్యం మనదే, పవర్ స్టార్ అనుకునే పవన్ కల్యాణ్‌ను ఢీ కొన్నారు.! ముగ్గురు త్రిమూర్తులం కలిశాం.. ఇక జగన్‌కు మూడిందని తెగ హడావుడి చేశారు. కానీ జగన్ జంకలేదు.. మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు. ఒకే ఒక్కడిగా ఢీ కొన్నాడు. ఆ వన్ అండ్ ఓన్లీనే ఎడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి..! వాస్తవానికి ఇలాంటి సీన్లు సినిమాల్లో తప్ప.. అదేనబ్బా రీల్‌లో తప్ప రియల్‌గా ఎక్కడా చూసి ఉండం. అదీ జగన్ రేంజ్.. వైసీపీ సత్తా..!

వచ్చాయ్.. గెలిచేసింది!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. లోక్‌సభ పోల్స్ నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ విడుదలయ్యాయి. మొత్తానికి రెండోసారి ఏపీలో వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమైపోయింది. దాదాపు సర్వేలన్నీ కూడా మూకుమ్మడిగా వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. మరీ ముఖ్యంగా.. తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరా మస్తాన్ సైతం వైసీపీకే అధికారాన్ని కట్టబెట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా పక్కాగా సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన సర్వే తప్పైంది లేదు. దీంతో జయహో జగన్ అంటూ సోషల్ మీడియా మోతెక్కుతోంది.

ఫుల్ జోష్!

ఆరా మస్తాన్ సైతం వైసీపీకే అధికారాన్ని కట్టబెట్టడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆరా మస్తాన్.. 94-104 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. టీడీపీ 71-81 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఇక ఆత్మ సాక్షి మొదలు రేస్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, ఆపరేషన్ చాణక్య వంటి సంస్థలన్నీ వైసీపీకే అధికారాన్ని కట్టబెట్టాయి. ముఖ్యంగా జగన్ కాన్ఫిడెన్స్ చూసి ముందుగా వైసీపీ శ్రేణులు పక్కాగా వైసీపీదే గెలుపని డిసైడ్ అయ్యాయి. ఇవాళ ఉదయం లండన్ నుంచి జగన్ గన్నవరానికి రాగా పెద్ద ఎత్తున వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎయిర్‌పోర్టుకు వచ్చి స్వాగతం పలికారు. మునుపెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో వైసీపీ నేతలు వచ్చి స్వాగతం పలికింది. ఇదంతా చూసిన జనం కూడా వైసీపీ విజయం ఫిక్స్ అని డిసైడ్ అవుతున్నారు.

వివిధ సర్వే ఫలితాలు..

ఆరా మస్తాన్ :-
వైసీపీ: 94-104
టీడీపీ : 71-81

ఆత్మసాక్షి :-
వైసీపీ : 98-116
టీడీపీ : 59-77

రేస్ :-
వైసీపీ : 117-128
టీడీపీ : 48-58

పోల్ స్ట్రాటజీ గ్రూప్:-
వైసీపీ : 115-125
టీడీపీ : 50-60

ఆపరేషన్ చాణక్య:-
వైసీపీ : 95-102
టీడీపీ : 64-68

చాణక్య పార్థదాస్ :-
వైసీపీ : 110-120
టీడీపీ : 55-65

జన్ మత్ :-
వైసీపీ : 95-103
టీడీపీ : 67-75

WRAP స్ట్రాటజీస్:-
వైసీపీ : 158-171
టీడీపీ : 0-4

అగ్నివీర్ :-
వైసీపీ : 124-128
టీడీపీ : 46-49

పొలిటికల్ లేబొరేటరీ :-
వైసీపీ :108
టీడీపీ : 67