కూటమికి అనుకూలంగా సర్వేలు..

కూటమికి అనుకూలంగా సర్వేలు..

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎప్పుడు వెలువడతాయా? అని ఏపీ ప్రజానీకం నరాలు తెగే ఉత్కంఠతో పార్టీలన్నీ ఎదురు చూశాయి. తెలంగాణ ప్రజానీకం సైతం   ఈసారి లోక్‌సభ ఫలితాల కంటే ఏపీ సర్వే ఫలితాల కోసమే ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తానికి సర్వే ఫలితాలు వచ్చాయి. పార్టీలకు ఒకింత కంగారు పెట్టేలా ఈ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. కొన్ని సర్వేలు కూటమికి.. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక మీడియా సంస్థలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో అవి మాత్రమే హైలైట్ చేస్తున్నాయి.

టీడీపీకి 161 సీట్లా?

మొత్తానికి ఏ సర్వే నిజం.. ఏ సర్వే అబద్ధం అనేది తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. కూటమికి కొన్ని సర్వేలు స్పష్టమైన మెజారిటీ చూపిస్తున్నాయి. రైజ్ అనే సర్వే సంస్థ 113 – 122 వరకూ కూటమికి వస్తాయని చెబుతోంది. పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అయితే కూటమికి 144 సీట్లు వస్తాయని చెబుతోంది. ఇక  కేకే సర్వేస్ అయితే కూటమికి ఏకంగా 161 సీట్లు కట్టబెట్టింది. చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, పల్స్ టుడే, జేబీఆర్‌జీ,స్మార్ట్ పోల్ సర్వే, జనన్‌మత్ పోల్స్ వంటి కొన్ని సంస్థలు టీడీపీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టడుతున్నాయి. 

బెట్టింగ్ రాయుళ్లలోనూ దడ..

వీటిని బట్టి చూస్తే టీడీపీ ప్రభుత్వం కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఏపీలో సర్వేలు కొంత మేర గందరగోళాన్ని అయితే సృష్టిస్తున్నాయి. వీటిలో మరి ఎంత వరకూ కరెక్ట్ అవుతాయో ఏమో కానీ సర్వేలు మాత్రం అటు పార్టీల్లోనూ.. ఇటు బెట్టింగ్ రాయుళ్లలోనూ దడను పెంచేస్తున్నాయి. ఏది ఏమైనా కానీ పార్టీలకు మాత్రం బీభత్సమైన టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆశ నిరాశల మధ్య పార్టీలన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి. మొత్తానికి పార్టీలన్నింటికీ గెలిచే అవకాశం అయితే సమపాళ్లలోనే ఉందని చెప్పాలి. అసలు మరికొన్ని గంటలాగితే కానీ పూర్తి క్లారిటీ రాదు.

Google News