బర్రెలక్క పెళ్లి.. ఏకి పారేస్తున్న నెటిజన్లు..

బర్రెలక్క పెళ్లి.. ఏకి పారేస్తున్న నెటిజన్లు..

బర్రెలక్క.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేని పేరు. తొలుత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి బర్రెలక్కగా ఫేమస్ అయిపోయింది. ఆ తరువాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి మరింత పాపులర్ అయిపోయింది. డిగ్రీలు.. బీటెక్‌లు చేసినా ఉపయోగం లేదని.. ఉద్యోగాలు మాత్రం రావడం లేదని అందుకే బర్రెలు కాసుకుంటున్నానంటున్న వీడియోతో బర్రెలక్క సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఈ వీడియోతోనే ఆమె బర్రెలక్కగా మారిపోయింది.

ఇక ఆ తరువాత గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననంటూ బర్రెలక్క సంచలనానికి తెరదీసింది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ట్రెండింగ్‌లో నిలిచింది. ఎన్నికల సమయంలో బర్రెలక్క హాట్ టాపిక్‌గా మారింది. మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లన్నింటిలో బర్రెలక్క పేరు మారుమోగింది. ఇక ఎన్నికలు ముగిశాక మాత్రం కొద్ది రోజుల పాటు బర్రెలక్క పేరు వినిపించలేదు. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

తన ఎంగేజ్‌మెంట్ అని చెప్పి పెళ్లికూతురులా మేకప్ చేసుకున్న వీడియోలను బర్రెలక్క సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి నిజంగానో పెళ్లో లేదంటే మేకప్‌కి సంబంధించిన ఐటెమ్స్ యాడో తెలియదు కానీ ఆమెను మాత్రం సోషల్ మీడియా బీభత్సంగా ట్రోల్ చేస్తోంది. ఆమె వెడ్డింగ్ కార్డులో వధువు శిరీష, వరుడు వెంకటేష్‌గా పేర్కొన్నారు. ముహూర్తం మార్చి 8 గురువారం అని ఉంది. మరి ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉండాలి కదా.. అవలేదు. దీన్నే జనాలు ఫన్నీ వేలో చెబుతున్నారు. బర్రెలక్క మొగుడు దొరికాడని కొందరు.. ఇది ఎన్నో పెళ్లని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. 

Google News