అందమైన యువతి.. పెళ్ళై రెండేళ్ళైనా శోభనం కాలేదని ఏం చేసిందంటే… ?

అందమైన యువతి.. పెళ్ళై రెండేళ్ళైనా శోభనం కాలేదని ఏం చేసిందంటే… ?

అందమైన యువతి.. ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. గంపెడు ఆశలతో అత్తారింట అడుగు పెట్టాననుకుంది. కానీ ఆ తరువాత కానీ ఆమెకు నరకంలో అడుగు పెట్టానన్న విషయం తెలియలేదు. పెళ్లయి రెండేళ్లయినా ఆమెను కొట్టడానికి తాకడం తప్ప అతను ప్రేమగా దగ్గరకు తీసుకుంది లేదట. రెండేళ్ల పాటు శారీరక సంబంధానికి కూడా దూరంగా ఉంచేశాడట. కారణం చెప్పడు.. గట్టిగా నిలదీస్తే కొడతాడు. అత్తమామలకు చెప్పినా ప్రయోజనం లేదు. ఇంటి నుంచి బయటకు వద్దామంటే జైలు లాంటి ఇంటి నుంచి బయటకు వెళ్లడం చాలా కష్టం.

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. ముజఫర్‌పూర్ వైశాలి జిల్లా లాల్ గంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు రెండేళ్ల క్రితం  అంటే అహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో వివాహమైంది. వారు మే 31, 2021న వివాహం చేసుకున్నారు. పెళ్లైన మరుసటి రోజే సదరు యువతి అత్తారింటికి వెళ్లింది. అయితే ఆమె భర్త మాత్రం ఆమె వంక కూడా చూడలేదు. రెండేళ్లయినా దగ్గరకు కూడా తీసుకున్న పాపాన పోలేదు. అదేమంటే ఏవేవో కారణాలు.. గట్టిగా నిలదీస్తే చెప్పుత ఆమెపై దాడి చేసేవాడు. ఆమెను అవమానించడం నిత్యకృత్యంగా మారిపోయింది. పోనీ పుట్టింటికి వెళదామంటే అలాగూ వెళ్లనివ్వడు. ఆ ఇంటి నుంచి తప్పించుకునేందుకు యత్నించి విఫలమైంది.

ఇక ఆ ఇంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని భావించిన సదరు యువతి బంధువుల సాయం కోరింది. వారు కూడా పట్టించుకోలేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో తన భర్త చెప్పేది వింటూ తనలో తనే కుమిలిపోయింది. ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేది. చివరకు ఎలాగైనా ఇంటి నుంచి తప్పించుకోవాలని భావించిన సదరు యుతి తన తాతయ్యకు బాగోలేదని ఆయన్ను చూడాలంటూ బయటకు వచ్చి నేరుగా ముజఫర్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై 341, 323, 498ఏ, 379, 504, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

Google News