-22 డిగ్రీల చలిలో ప్రి వెడ్డింగ్ షూట్.. చివరకు ఏమైందంటే ?

-22 డిగ్రీల చలిలో ప్రి వెడ్డింగ్ షూట్.. చివరకు ఏమైందంటే ?

ప్రస్తుత కాలంలో ప్రి వెడ్డింగ్ షూట్ లేనిదే పెళ్లి జరగడం లేదు. వాటిని ఓ సినిమా తీసినట్టు తీస్తున్నారు. షూట్ కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ఈ ప్రి వెడ్డింగ్ షూట్ పిచ్చి రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఈ పిచ్చితో ఏం చేస్తున్నారో.. ఏమో అనే స్పృహ కూడా లేకుండా పోతోంది. గతంలో ఓ జంట కేరళలో ప్రి వెడ్డింగ్ షూట్ చేస్తూ పడవలో అదుపుతప్పి నీటిలో పడిపోయారు. ఇక ఇప్పుడైతే ఓ జంట ప్రాణం మీదకే తెచ్చుకుంది.

ఆర్యావోరా.. ట్రావెలింగ్ వీడియోస్‌తో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బీభత్సమైన పాపులారిటీని తెచ్చుకుంది. అనంతరం ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ మంచి క్రేజ్‌నే తెచ్చుకుంది. ఇవన్నీ కలిసి అమ్మడికి బుల్లితెరపై అవకాశం తెచ్చి పెట్టాయి. ‘దేవో కి దేవ్ మహదేవ్’ అనే సీరియల్‌తో బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇక ఇంత పాపులారిటీ వచ్చాక ఆగుతారా? ప్రి వెడ్డింగ్‌ షూట్‌ని అదరగొట్టేసి మరింత పాపులర్ అయిపోవాలని భావించింది.

-22 డిగ్రీల చలిలో ప్రి వెడ్డింగ్ షూట్.. చివరకు ఏమైందంటే ?

హిమచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీకి ఆర్యావోరా తనకు కాబోయే భర్తతో కలిసి వెళ్లి ప్రి వెడ్డింగ్ షూట్ చేసింది. అక్కడ -22 డిగ్రీల చలి ఉంది. అంత చలి అంటే మాటలా? శరీరంలో ఉష్టోగ్రత సడెన్‌గా పడిపోయి హైపోథెర్మియాకు గురై వెంటనే స్పృహ కోల్పోయిందట. వెంటనే తనతో ఉన్నవాళ్లు ఫస్ట్ ఎయిడ్ చేశారట. దాదాపు మృత్యువుతో పోరాడి మరీ తిరిగి ప్రాణాలు నిలబెట్టుకున్నానంటా ఆర్యా స్వయంగా ఓ వీడియోతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Google News