Ram Charan: రామ్ చరణ్ సినిమాలో పాటలకే రూ.50 కోట్లు..!
ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అంటే ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి? ఓ రేంజ్‌లో ఉంటాయి కదా. ఇక చెర్రీ చేస్తున్నది.. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా. ఇక అది ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పటికే చెర్రీ సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటుందని జనం ఊహించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చెర్రీ సినిమా ఆ స్థాయికి ఏమాత్రం తగ్గినా కూడా ఫ్యాన్స్ హర్షించరు. అన్నీ దృష్టిలో పెట్టుకుని శంకర్ (Shankar) ఈ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతం పూర్తి అయినట్టు నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతోంది. చెర్రీకి జంటగా కైరా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ఆసక్తికర విషయం వచ్చేసి ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక తాజాగా సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శంకర్ సినిమాలన్నింటికీ ఏఆర్ రెహ్మాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు మాత్రం శంకర్.. రెహ్మాన్‌ను పక్కనబెట్టేశారు. ఈ సారి సౌత్ ఇండియన్ సెన్సేషన్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని సాంగ్స్ చిత్రీకరణ జరిగిందని.. వాటికి తమన్ (Thaman) అద్భుతమైన సంగీతం ఇచ్చారని టాక్. రీసెంట్‌గా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోకి కూడా థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నారు. దీంతో ఈ సినిమాలో మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుందన్న టాక్ ప్రారంభమై పోయింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కేవలం సాంగ్స్ కోసమే శంకర్ (Shankar) రూ.50 కోట్లు ఖర్చు చేశారట. జీన్స్ మూవీలో ఓ సాంగ్‌లో ప్రపంచంలో ఏడు వింతల్ని శంకర్ చూపించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో సాంగ్స్‌లో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ వాడారోనన్న చర్చ నడుస్తోంది.