Madhavi Latha: మీడియాలో ఆ వార్తలు చూసి చనిపోవాలనుకున్నా: మాధవీలత

Madhavi Latha

మాధవీలత(Madhavi Latha).. హీరోయిన్‌గా తొలి సినిమా సక్సెస్ అయినప్పటికీ ఎందుకో గానీ ఇండస్ట్రీలో ఆశించిన మేర గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు యత్నిస్తోంది. ఇక మాధవీలత(Madhavi Latha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదరైన చేదు అనుభవాల గురించి.. అలాగే తాను వాటిని ఎలా హ్యాండిల్ చేశాననే దాని గురించి వెల్లడించింది. నిజానికి తాను చాలా సౌమ్యురాలినని టెంపర్ కోల్పోతే తప్ప ఎవరినీ బాధపెట్టననవి వెల్లడించింది. అందుకే తనకు ఇండస్ట్రీలో కూడా ఎవరితోనూ ఎలాంటి సమస్యలూ లేవని తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఎవరూ నమ్మరని తెలిపింది. ఇండస్ట్రీలో ఎవరైన నిర్మాత గానీ.. వేరొక వ్యక్తిగానీ తనతో తప్పుగా మాట్లాడినా కూడా శాంతంగానే బదులిస్తానని మాధవీ లత(Madhavi Latha) వెల్లడించింది.

ఈ క్రమంలోనే తనను ముందు రోజు.. వస్తావా..? అని వంకరగా మాట్లాడిన వాళ్లు కూడా మరుసటి రోజు నుంచి అమ్మ అని పిలిచారని మాధవీలత వెల్లడించింది. ఇండస్ట్రీలో మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని మసలు కోవాలని చెప్పింది. కాగా.. తనకు మైగ్రేన్ ఉందని.. అందుకే తానెప్పుడు టాబ్లెట్ వేసుకుంటానని తెలిపింది. అయితే ప్రేమ సినిమాలో రేవతి అస్తమానం టాబ్లెట్లు మింగడంతో అవి ఆమెకు పని చేయడం మానేశాయని.. తనకు కూడా భవిష్యతులో అలాగే అవుతుందేమోనని డిప్రెషన్‌కు గురయ్యానని తెలిపింది. ఆ ఆలోచనతోనే చివరకు తనకు ఏ టాబ్లెట్ పని చేయదని పోస్ట్ పెట్టి పడుకున్నానని.. తెల్లవారే లేచేసరికి మీడియాలో తాను చనిపోబోతున్నాననే వార్తలు వచ్చాయని మాధవీలత(Madhavi Latha) వెల్లడించింది. అది తనను మరింత డిప్రెషన్‌కు గురి చేసి చనిపోవాలనుకునే వరకూ తీసుకెళ్లిందని తెలిపింది.

Google News