Samantha: ఇలాగే సింపతీ డ్రామాలాడితే.. నువ్వు చచ్చిపోతున్నావన్న చూడరు: సమంతపై నిర్మాత ఫైర్

Producer fires on Samantha

సమంత(Samantha) అంటేనే మండిపడుతున్నారు నిర్మాత చిట్టిబాబు. తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సమయంలో కూడా చిట్టిబాబు(Chitti Babu) ఫైర్ అయ్యారు. అది అందరికీ వచ్చే వ్యాధేనని.. ప్రాణాంతక రోగమేమీ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం యశోద సినిమా సక్సెస్ కోసమే సమంత(Samantha) రోగం పేరుతో సింపతీ కార్డు తీసిందన్నారు. ఇక తాజాగా శకుంతలం సినిమా ప్రమోషన్స్‌ సమయంలో కూడా సమంత తనకు హెల్త్ బాగోలేదని ట్వీట్ చేసింది.

వరుస ఈవెంట్స్ కారణంగా జ్వరం వచ్చిందంటూ సామ్ ట్వీట్ చేసింది. దీనిని చూసిన చిట్టిబాబు(Chitti Babu) మరోసారి ఆమెపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. సమంతది అంతా నాటకమేనని.. ఆమె తన విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకు దెరువు కోసం వచ్చిన ఆఫర్సేవీ వదట్లేదని.. నిజానికి సమంత స్టార్ డమ్ ఎప్పుడో పోయిందన్నారు. ఇక మీదట ఆమెకు స్టార్ డమ్ తిరిగి వచ్చే అవకాశం కూడా లేదని చిట్టిబాబు పేర్కొన్నారు.

Producer fires on Samantha

యశోద(Yashoda) సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే ఆరోగ్యం బాగోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుందని చిట్టిబాబు పేర్కొన్నారు. కేవలం తన సినిమా సక్సెస్ కోసమే సింపతీ కార్డ్ వాడుతోందని దుయ్యబట్టారు. మళ్లీ శాకుంతలం మూవీ విషయానికి వస్తే ఇదే సింపతీని ప్లే చేస్తోందని.. పదే పదే ఇలా చేస్తే అవి వర్కవుట్ కావన్నారు. ఇలాగే చేస్తూ పోతే.. తాను చచ్చిపోతానన్నా కూడా ప్రేక్షకులు సినిమా చూడరన్నారు. అసలు ఏమాత్రం స్టార్ డమ్ లేని సమంత(Samantha)ను శాకుంతలం(Shaakuntalam) మూవీకి ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదని చిట్టిబాబు(Producer Chittibabu) పేర్కొన్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!