ఆసుపత్రిపాలైన సాయాజీ షిండే.. కారణమేంటంటే..

ఆసుపత్రిపాలైన సాయాజీ షిండే.. కారణమేంటంటే..

నటుడు సాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. మహారాష్ట్ర చెందిన షిండే తెలుగులోనే కాకుండా మరాఠీ, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ వంటి 4 భాషాల్లో నటించి మంచి ఆర్టిస్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ విషయం ఆయన ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. అదేంటంటే సాయాజీ షిండే ఆసుపత్రి పాలయ్యారట.

విపరీతమైన ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే షిండేను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారట. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా… అయితే ఆయన గుండెలో వెయిన్ బ్లాక్ అయ్యిందని పరీక్షల్లో తేలిందట. వైద్యులు ఆయనకు వెంటనే యాంజియోప్లాస్టీ సూచించారట. ప్రస్తుతం అయితే సాయాజీ షిండే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. తొలుత సాయాజీ షిండే 2001లో టాలీవుడ్‌లోకి సూరి సినిమాతో అడుగు పెట్టారు. ఆ తరువాత వరుసబెట్టి సినిమా అవకాశాలు ఆయన తలుపుతట్టాయి. ముఖ్యంగా ఆయన యాక్సెంట్ తెలుగు ప్రజలకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆయనకు టాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.

Google News