చెర్రీకి డాక్టరేట్.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ

చెర్రీకి డాక్టరేట్.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. చెన్నైలోని పల్లవరంలో వేల్స్ వర్సిటీ స్నాతకోత్సవం ఏప్రిల్ 13న జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్‌ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ అధ్యక్షుడు డీజీ సీతారాం… రామ్ చరణ్ కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే జనసేనాని పవన్ కల్యాణ్‌కు డాక్టరేట్ ప్రకటించింది.

పవన్ దానిని సున్నితంగా తిరస్కరించారు. వివిధ రంగాల్లో తనకంటే బాగా రాణించిన వారు చాలా మంది ఉన్నారని.. తాను ఈ డాక్టరేట్‌ను స్వీకరించలేనని తెలిపారు. ఇక తాజాగా రామ్ చరణ్‌కు ప్రకటించింది. సినీ రంగంలోనూ అలాగే సామాజికంగానూ చెర్రీ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ డాక్టరేట్‌ను ఎంపిక చేసినట్టు యూనివర్సిటీ తెలిపింది. అయితే చెర్రీకి డాక్టరేట్ ప్రకటించగానే సోషల్ మీడియాలో రచ్చ ప్రారంభమైంది.

Vels Invitation

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, మహేష్, ప్రభాస్, ఎన్ఠీఆర్…. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్స్ ఉన్నారు. వారందరినీ వదిలేసి చెర్రీకి ఇవ్వడమేంటని అంతా ప్రశ్నిస్తున్నారు. సినీరంగాన్ని పక్కనబెడితే సామాజికంగా చెర్రీ చేసిందేమీ లేదు. చిరంజీవి విషయం వేరు కానీ చరణ్ సమాజానికి చేసిందేమీ లేదు. అలాంటప్పుడు చరణ్‌కి డాక్టరేట్ ఏంటని ట్రోల్ చేస్తున్నారు. కాగా.. గతంలో ఈ యూనివర్సిటీ డైరెక్టర్ శంకర్‌కు కూడా డాక్టరేట్ ఇచ్చింది.

Google News