గ్లోబల్ స్టార్ ఇక.. డాక్టర్ రామ్ చరణ్..!!

గ్లోబల్ స్టార్ ఇక.. డాక్టర్ రామ్ చరణ్..!!

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల.. ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ అయ్యాడు. శనివారం నాడు చెన్నైలోని వేల్స్ యూనివర్సీటీ డాక్టరేట్‌ను ప్రధానం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి స్నాతకోత్సవంకు వెళ్లిన చెర్రీ.. డాక్టరేట్‌ అందుకున్నాడు. కళా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్ చేసి సంతోషపడ్డారు.

ఇది మెగాభిమానులకు నిజంగా హ్యాపీ మూమెంట్. ఐతే మిగతా వాళ్లు మాత్రం ఏదో రకంగా ట్రోల్స్ వేస్తున్నారు. నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. తమిళంలో శింబు.. తెలుగులో చెర్రీకి వచ్చిందని నెటిజన్లు ఒక రేంజిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి చరణ్ పేరు మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతోంది. చెర్రీకి డాక్టరేట్‌ వస్తోందన్నప్పటి నుంచి ఎలా ట్రోల్ నడిచింది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

గ్లోబల్ స్టార్ ఇక.. డాక్టర్ రామ్ చరణ్..!!

కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్న చెర్రీ రెండు నెలల్లో ఫ్రీ కానున్నాడు.. దీని తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టనున్నాడు.

Google News