Actress Yamuna: చచ్చినా కూడా సోషల్ మీడియా నన్ను వదిలేలా లేదు: యమున ఆవేదన

Actress Yamuna 2

ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక పేరు పడిందంటే చాలు. అది జీవిత కాలం ఉండిపోతుంది. దానిలో వారి తప్పు లేకున్నా కూడా నిందను మాత్రం మోయాల్సి వస్తుంది. వారి ప్రస్తావన వస్తే చాలు ముందుగా గుర్తొచ్చేది వారు బ్లేమ్ అయిన సందర్భమే. తాజాగా నటి యమున (Actress Yamuna) విషయంలోనూ అదే జరుగుతోంది. ఎప్పుడో ఏదో జరిగిందని దానిని పట్టుకుని నేటికీ వేధిస్తున్నారట. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే మరో అడుగు ముందుకేసి తంబ్ నెయిల్స్ పెట్టి మరీ వేధిస్తోందట.

నటి యమున (Actress Yamuna) ఆవేదన అంతా ఇంతా కాదు. సినిమాల్లో అవకాశాలు తగ్గాక ఆమె సీరియల్స్‌లో చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. సీరియల్స్ పరంగా కూడా ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. కాగా.. 2011లో ఆమె కొరీర్ సాఫీగా కొనసాగుతున్న సమయంలోనే యమున బెంగుళూరులోని ఓ హోటల్‌లో జరిగిన రైడ్‌లో పట్టుబడింది. దీంతో ఆమె చాలా కాలం పాటు బయటి ప్రపంచానికి కనిపించలేదు. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా యమున (Actress Yamuna) ఉండిపోయారు.

Actress Yamuna

నిజానికి తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. కోర్టు సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకున్నా కూడా కొందరు వినడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ఇబ్బంది పెడతున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారు కూడా తంబ్ నెయిల్స్ పెట్టి మరీ వేధిస్తున్నారట. ఈ మేరకు తన (Actress Yamuna) ఆవేదననంతూ వెల్లడిస్తూ ఓ వీడియోను యమున విడుదల చేసింది. తనను కావాలనే కొంతమంది ఇరికించారని చెప్పినా కూడా వినిపించు కోవడం లేదట. తాను కూడా మనిషినేనని.. చచ్చినా కూడా సోషల్ మీడియా తనను వదలేలా లేదని యమున (Actress Yamuna) ఆవేదన వ్యక్తం చేశారు.

Google News