NTR, Ram Charan Fans: హర్టైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్..

NTR, Ram Charan fans disappointed

నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆస్కార్ అవార్డు (Oscar Award) గెలుచుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ఆర్ఆర్ఆర్ (RRR) చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ చిత్ర టీంపై సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వంటి వారైతే పుత్రోత్సాహంతో ఊగిపోతున్నారు. ప్రతి ఒక్కరూ నాటు నాటు దక్కించుకున్న ఘనతకు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు చిత్ర టీం ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. తెలుగు చిత్ర గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అయితే ఆస్కార్ ప్రకటించగానే పసిపిల్లాడిలా కేరింతలు కొట్టారు. ఇక చిత్ర హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ (Ram Charan) ఆనందానికి అవధులు లేకుండా పోయినప్పటికీ ఒక విషయంలో మాత్రం వారు బాగా హర్ట్ అయ్యారు. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్‌ను చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani), గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) అందుకున్నారు.

RRR Naatu Naatu wins Oscar award

నిజానికి ఇంతకు మించిన సంగీతం, ఇంతకు మించిన లిరిక్స్ ఉన్న పాటలు చాలా ఉన్నాయనేది ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్ (NTR, Ram Charan Fans) చెబుతున్న మాట. ఈ సాంగ్‌కి కాదు.. ముఖ్యంగా మా హీరోలు వేసిన డ్యాన్స్ బాగా హైలైట్ అవడంతోనే ఆస్కార్ బరిలో నిలిచింది.. అలాగే ఆస్కార్‌ను గెలుచుకుంది. అలాంటప్పుడు మా హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Cahran), అలాగే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) కదా.. అవార్డును అందుకోవాలి అనేది ఫ్యాన్స్ వర్షన్. ఈ ఒక్కటి కూడా జరిగి ఉంటే తాము ఓ రేంజ‌్‌లో పండుగ చేసుకుని ఉండేవారమని.. ఎన్టీఆర్, చెర్రీ ఫ్యాన్స్(NTR, Ram Charan Fans) సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!