Rana Naidu: ఇదేందయ్యా ఇది.. వెంకటేష్.. కాస్త బుతేష్ అయ్యాడు!

Rana Naidu web series

విక్టరీ వెంకటేష్..(Victory Venkatesh) ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన హీరో. అంతేకాదు.. వెంకీ (Venkatesh)తన ఏజ్‌కు తగ్గ పాత్రలను ఎంచుకుంచూ మంచి మూవీస్ చేస్తున్నాడనే టాక్ ఉంది. ఇక రానా దగ్గుబాటి (Rana Daggubati). తనకు ప్రాధాన్యముండే ఏ పాత్రయినా సరే ఆకట్టుకునేలా చేయడంలో దిట్ట. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కోరి ‘రానా – నాయుడు’ (Rana Naidu) ద్వారా నెరవేరింది. ఇది సినిమా కాకున్నా ఒక వెబ్ సిరీస్.

ఏదైతేనేమి ఇద్దరూ కలిసి చేశారు. ‘రానా – నాయుడు’ నిన్నటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దీనిని చూసిన తెలుగు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. బూతులు బాగా ఎక్కువ. పైగా అభ్యంతరకర సన్నివేశాలు కూడా ఎక్కువే. ఇది చూశాక కానీ వెంకీ ఎందుకు ఈ వెబ్‌సిరీస్‌ (Rana Naidu)ను ఒంటరిగా చూడమన్నారనేది ప్రేక్షకులకు అర్ధం కాలేదు. అస్సలు వెంకీ (Venkatesh) ఇలాంటి వాటిలో ఎందుకు చేశార్రా బాబూ అని ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకొదరైతే ఈ రానా – నాయుడు (Rana Naidu) వెంకీ ఇమేజ్ మొత్తం పోయి వెంకటేష్ (Venkatesh) కాస్త బూతేష్ గా అయ్యారని సెటైర్స్ వేస్తున్నారు.

Rana Naidu web series

వాస్తవానికి మిర్జాపూర్ (Mirzapur) వెబ్ సిరీస్ గురుంచి అందరికీ తెలిసే ఉంటుంది.. అందులో పచ్చి బూతులే ఉంటాయ్.. ఇప్పుడు రానా – నాయుడు (Rana Naidu)లో అంతకు మించి ఉన్నాయని ప్రేక్షకులు వాపోతున్నారు. అయితే ఈ రెండిటికీ డైరెక్టర్ కరణ్ అషుమన్ ఒక్కరే కావడం గమనర్హం. అందుకే ఈ రేంజ్ లో బూతుల వర్షం కురిపించారన్న మాట..!

ఈ వెబ్ సిరీస్‌ కథ ఏంటంటే..! (Rana Naidu story)

బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి సమస్య వచ్చినా పరిష్కరించే వ్యక్తి రానా. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు.. మొత్తానికి హ్యాపీ లైఫ్. ఇక రానా తండ్రిగా నటించిన నాయుడు (వెంకటేష్) జైలు నుంచి విడుదలవుతాడు. తండ్రీ కొడుకులిద్దరికీ అస్సలు పడదు. తండ్రి తిరిగి తమ జీవితంలోకి వస్తే సమస్యలు వస్తాయని రానా (Rana Daggubati) భయపడుతుంటాడు. తండ్రీకొడుకుల మధ్య గొడవలేంటి? నాగానాయుడు వచ్చాక రానా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేది ఈ వెబ్ సిరీస్ (Rana Naidu) కథ. ఇక వెబ్ సిరీస్ సాగదీత కూడా చాలా ఎక్కువని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!