Pawan Kalyan: ఆ హుషారు ఆస్కార్ వేదికపై రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది: పవన్

Pawan Kalyan Naatu Naatu

‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ పురస్కారాన్ని స్వీకరించిందన్నారు. ‘ఆర్ఆర్ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani)కి, గీత రచయిత చంద్రబోస్‌ (Chandrabose)కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెల్లడించారు.

ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రంలో ‘నాటు నాటు’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించిందని పవన్ (Pawan Kalyan) కొనియాడారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ (Oscar) వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించిందన్నారు. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు… అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందన్నారు.

RRR Naatu Naatu wins Oscar award

ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli)కి పవన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్‌ (Ram Charan)లు కథానాయకుల పాత్రల్లో ఒదిగిపోయారన్నారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj), కాలభైరవ (Kala Bhairava), నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith), చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యలకు అభినందనలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తాయని పవన్ పేర్కొన్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!