Chiranjeevi: నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం భారత్ కల: చిరు

Chiranjeevi About Oscar

‘ఆర్ఆర్ఆర్’ (RRR) టీంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. విశ్వ వేదికపై ఈ చిత్రంలో నాటు నాటు (Naatu Naatu) సాంగ్ సత్తా చూపడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)ల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా వారు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులంతా ట్విటర్ వేదికగా ఆర్ఆర్ఆర్ (RRR)టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుత్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది. చిత్ర బృందంలోని కీలక వ్యక్తులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. నాటు నాటు సాంగ్‌కి ఆస్కారం అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని పేర్కొన్నారు. అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందంటూ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.

RRR Wins Oscar

కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయని చిరు పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ట్విటర్ వేదికగా చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ (Rajul Sipligunj), ప్రేమ్‌రక్షిత్ (Prem Rakshith), ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (RamCharan), రాజమౌళి (Rajamouli)లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ది ఎలిఫెంట్ విస్పరస్’ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు రావడం పట్ల కూడా చిరంజీవి (Chiranjeevi) సంతోషం వ్యక్తం చేశారు.

NTR at Oscars: గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్‌ ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ.. అదేమని నిర్వాహకులు ఆరా తీస్తే..

Naatu Naatu on Oscar Stage: ఆస్కార్ స్టేజ్‌‌పై ‘నాటు నాటు’ లైవ్.. కేరింతలతో దద్దరిల్లిన డాల్ఫీ థియేటర్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!