NTR at Oscars: గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్ ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ.. అదేమని నిర్వాహకులు ఆరా తీస్తే..
ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమైంది. 95వ ఆస్కార్ అవార్డు (Oscar Awards) ల ప్రధానోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఐదు గంటలకు ఈ వేడుక ప్రారంభమైంది. కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ వేడుకను తిలకిస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్షకులైతే మరీనూ. తమ అభిమాన హీరోలు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందా? లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆస్కార్ కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR Movie) సత్తా చాటాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో పోటీ పడుతున్న ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాటను ఆస్కార్ వరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ పాటను ఆస్కార్ వేదిక (Oscar) పై రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), కాల భైరవ (Kala Bhairava) ఈ పాటను ఆలపించారు. ఆ పాట ఆలపించిన తక్షణమే అక్కడకి వచ్చిన హాలీవుడ్ నటీనటులు, సాంకేంతిక నిపుణులు అందరూ లేచి నిలబడి ఈ పాటకి చప్పట్లతో తమ హర్షం వ్యక్తం చేశారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చిన తీరు చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. ఆశ్చర్యంతో కళ్లు ఇంతవి కావాల్సిందే. నిర్వాహకులే ఆశ్చర్యపోయి అదేంటని అడిగారంటే ఆయన ఎంత స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్ (Jr NTR) ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద ఎంట్రీ ఇచ్చారు. సూట్‌పై పులి బొమ్మ ఏంటని నిర్వాహకులు ఆరా తీయగా.. పులి.. భారత జాతీయ జంతువని ఎన్టీఆర్ (NTR) చెప్పాడు. రెడ్ కార్పెట్‌పైకి ఇండియా నడిచి వస్తున్న.. సింబల్‌గా ఎన్టీఆర్ చెప్పడం విశేషం.