Naatu Naatu on Oscar Stage: ఆస్కార్ స్టేజ్‌‌పై ‘నాటు నాటు’ లైవ్.. కేరింతలతో దద్దరిల్లిన డాల్ఫీ థియేటర్

Naatu Naatu song on Oscar stage

తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అదే ప్రపంచ సినిమా పండుగైన ఆస్కార్ (Oscar Awards) వేడుక. లాస్ ఏంజిల్స్‌లో ఈ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం.. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైంది. ఇక కోట్లాది మంది ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణం కూడా రానే వచ్చింది. అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie) సత్తా చాటాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Naatu Naatu song on Oscar stage

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట పోటీ పడుతోంది. ఈ పాట ఆస్కార్‌ (Oscar) సాధించాలని కోరుకోని తెలుగు ప్రేక్షకుడు లేడేమో. కోరుకోని క్షణం కూడా లేదు. మరికొద్ది సేపట్లో ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ లభిస్తుందా? లేదా? అన్నది తేలిపోనుంది. ఈ క్రమంలోనే కొద్ది సేపటి క్రితం ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ (Naatu Naatu)పాటను రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), కాలభైరవ (Kala Bhairava) ఆలపించారు. హాలీవుడ్ డ్యాన్సర్లు చిందులేసి ఉర్రూతలూగించారు.

ఈ పాట ప్రదర్శించిన సందర్భంలో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ జరుగుతున్న డాల్బీ థియేటర్ కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఈ పాట పూర్తైన వెంటనే అక్కడ ఉన్న హాలీవుడ్ నటీనటులు సహా నిర్వాహకులు సైతం లేచి నిలబడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే ప్రకటించిన ప్రకారం.. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’.. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్‌.. ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ తదితరులు ఆస్కార్ అవార్డులను దక్కించుకున్నారు.

NTR: వామ్మో.. ఎన్టీఆర్ వాచ్ ఖరీదెంతో తెలిస్తే…!

NTR at Oscars: గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్‌ ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ.. అదేమని నిర్వాహకులు ఆరా తీస్తే..

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!