Naatu Naatu wins Oscar:తెలుగోడి సత్తాకి సంతకం అయిన ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్..

MM Keervani, Chandrabose with Oscar Award

తెలుగు ప్రేక్షకులకు.. ఆ మాటకొస్తే దక్షిణాదికి ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ లభించింది. దక్షిణాది నుంచి తొలి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చరిత్రలో నిలిచి పోనుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ (Naatu Naatu Song)కు ఆస్కార్ అవార్డు లభించింది. ఎంఎం కీరవాణి (MM Keeravani(), గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) ఈ అవార్డును అందుకున్నారు.

నాటు నాటు (Naatu Naatu)సాంగ్‌కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), చిత్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) తదితరుల కళ్లలో ఆనందం మాటల్లో చెప్పలేనిది. ప్రపంచ పటంపై జక్కన్న మెరిశారు. నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ (Oscar) వేదికపై కాల భైరవ (Kala Bhairava), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఆలపించారు. అంతే స్టేడియం మొత్తం కేరింతలతో మారు మోగిపోయింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రతి తెలుగు వాడికి గర్వకారణమని కీరవాణి (MM Keeravani) పేర్కొన్నారు.

RRR Naatu Naatu wins Oscar award

మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీ చరిత్రను తిరగరాసింది. ప్రపంచ పటంపై తెలుగు జాతి గొప్పదనాన్ని నిలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చలన చిత్రానికి గుర్తింపు లభించేలా చేసిన ఘనత ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీదే. ఈ పాట ఆస్కార్‌ సాధించాలని కోరుకోని తెలుగు ప్రేక్షకుడు లేడేమో. కోరుకోని క్షణం కూడా లేదు. అందరూ ఎంత గట్టిగా కోరుకున్నారనేది అవార్డ్ దక్కించుకోవడంతో తెలిసి వచ్చింది. ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith) ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చరిత్ర సృష్టించేసింది.

NTR at Oscars: గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్‌ ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ.. అదేమని నిర్వాహకులు ఆరా తీస్తే..

Naatu Naatu on Oscar Stage: ఆస్కార్ స్టేజ్‌‌పై ‘నాటు నాటు’ లైవ్.. కేరింతలతో దద్దరిల్లిన డాల్ఫీ థియేటర్

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!