Rajamouli: నాటు నాటు’కు ఆస్కార్ ప్రకటించగానే రాజమౌళి రియాక్షన్ చూశారా?

Rajamouli reaction at Oscar Awards

తెలుగు పాట ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ అవార్డు (Oscar Award) గెలుచుకొని చరిత్ర సృష్టించింది. దక్షిణాదిలోనే ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ (Oscar Award) రికార్డ్ క్రియేట్ చేసింది. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ (Oscar) గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. వేళ్ల మీద లెక్కించగలిగినన్ని సినిమాలు మాత్రమే. అలాంటిది ఒక తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie)లోని నాటు నాటుకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి (SS Rajamouli) మారిపోయారు.

హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన క్షణాలివి. దక్షిణాది నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. అసలు ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), కాల భైరవ (Kala Bhairava) ఆస్కార్ స్టేజ్‌పై ఆలపిస్తుంటే తెలుగు వారి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆస్కార్ అవార్డును సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani), గీత రచయిత చంద్రబోస్‌ (Chandrabose)లు ఆస్కార్ అవార్డును అందుకున్నారు.

ఇదంతా పక్కనబెడితే అసలు ఈ అవార్డును ప్రకటించినప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) రియాక్షన్ చూడాలి. ఆయన ఒక చిన్న పిల్లాడిలా మారిపోయారు. కేరింతలు కొట్టారు. పక్కన ఉన్న తన సతీమణి రమను హగ్ చేసుకుని మరీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనదే. ఇప్పటి వరకూ ఆయన హిస్టరీలో ఫ్లాప్ అనేదే లేదు. ఇక ఇప్పుడు ఆస్కార్ సైతం ఆయన సినిమాను వరించింది.

NTR: వామ్మో.. ఎన్టీఆర్ వాచ్ ఖరీదెంతో తెలిస్తే…!

Naatu Naatu wins Oscar:తెలుగోడి సత్తాకి సంతకం అయిన ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్..

NTR at Oscars: గర్జించే పులిబొమ్మ ఉన్న సూట్‌తో ఎన్టీఆర్‌ ఆస్కార్ స్టేజ్‌పై ఎంట్రీ.. అదేమని నిర్వాహకులు ఆరా తీస్తే..