Oscar To RRR : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే ఆస్కార్ విజేత అయ్యాడు..!

Oscar Award

ఒక సక్సెస్‌కి చేరుకోవాలంటే ఆ దారిలో ఎన్నో రాళ్లు, ముళ్లను దాటుకుంటూ ముందుకెళ్లాలి. దాటలేమని ఇక్కడితో ప్రయాణం చాలిద్దాంలే అనుకుంటే ఒక గొప్ప సక్సెస్‌ని అందుకోలేం అనడానికి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టరే ఉదాహరణ. ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ ఆస్కార్‌ను సాధించడం వెనుక ఆయన కృషి అపారం. అంతలా అదరగొట్టే స్టెప్స్ ఆయన కంపోజ్ చేయకుంటే ఆస్కార్‌కి సాధ్యమయ్యేది కాదని సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న టాక్.

Choreographer Prem Rakshith

‘నాటు నాటు’ (Naatu Naatu)కు మించిన గొప్ప పాటలు ఎన్నో వచ్చాయి. ఇంతకు మించిన సంగీతమూ వచ్చింది కానీ ఈ రేంజ్ డ్యాన్స్ మాత్రం ఏ సినిమాలోనూ లేదనే చెప్పాలి. దాదాపు 90 స్టెప్స్ ఒక పాట కోసం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఇక ఇద్దరూ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)లు సైతం డ్యాన్స్‌ను ఉతికి ఆరేసేవారు కావడంతో ఈ సాంగ్ ఇంత గొప్ప సక్సెస్ అయ్యింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ అవార్డును అందుకుంది.

Advertisement
Choreographer Prem Rakshith with Rajamouli

అయితే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ (Prem Rakshith Master) ఇండస్ట్రీకి రాకపూర్వం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారట. దీంతో ఎన్నో సార్లు జీవితం చాలించాలని భావించారట. అలాంటి సమయంలో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చి ‘ఛత్రపతి’ (Chatrapathi Movie) సినిమా ఆయనకు ప్రాణం పోసిందట. ఆ సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం.. చక్కగా సద్వినియోగ పరుచుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదట. ఇక నాటి నుంచి రాజమౌళి సినిమాలన్నింటికీ ప్రేమ్ రక్షిత్ (Prem Raksthith) మాస్టరే కొరియోగ్రాఫర్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రేమ్ రక్షిత్ (Prem Rakshith).. కష్టాలను అధిగమించి నేడు ఆస్కార్ వరకూ వెళ్లారు.