Hyper Aadi: అలీ స్థానంలోకి హైపర్ ఆది.. ఇకపై పవన్ ప్రతి సినిమాలోనూ ఉంటాడట..!

Hyper Aadi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో కమెడియన్ అలీ (Comedian Ali) ఉండేవారన్న విషయం తెలిసిందే. వీరిద్దరి స్నేహబంధం పవన్ రెండవ సినిమా నుంచి ప్రారంభమైంది. కాటమ రాయుడు వరకూ నిర్విఘ్నంగా కొనసాగింది. అలీ (Ali)ని పవన్ (Pawan Kalyan) బాగా దగ్గరకు తీశారు. చాలా ఇంటర్వ్యూల్లో కూడా అలీతో ఉన్న అనుబంధాన్ని పవన్ చెబుతూ వచ్చారు. నిజానికి పవన్ అతికొద్ది మందికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. వారిలో అలీ (Comedian Ali) కూడా ఒకరు.

కానీ ఇటీవల అలీ రాజకీయ ఆరంగేట్రం చేయడం.. అది కూడా జనసేనలో కాకుండా వైసీపీ (YSRCP)లో చేరడంతో పవన్ (Pawan Kalyan), అలీ (Comedian Ali)ల మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. ఆ తరువాత పవన్‌కు ఎదురెళ్లేందుకు కూడా అలీ వెనుకాడకపోవడం.. పవన్‌పై పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు గుప్పించడం వంటివి చేశారు. అయితే పవన్ (Pawan Kalyan)మాత్రం ఎక్కడా కూడా అలీ (Comedian Ali) గురించి నోరు జారలేదు. కానీ అలీ చేస్తున్న కామెంట్స్ ఆయనకు ఇబ్బందికరంగా అనిపించి ఉండవచ్చు.

Hyper Aadi with Pawan Kalyan

ఈ క్రమంలోనే అలీ (Comedian Ali)ని పవన్ పక్కనబెట్టేశారు. కాటమరాయుడు తర్వాత తన సినిమాల్లో అలీకి ఆయన స్థానం కల్పించలేదు. ఇప్పుడు అలీ స్థానంలోకి ప్రముఖ జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ హైపర్ (Hyper Aadi) ఆది వచ్చి చేరాడు. ఇప్పటికే పొలిటికల్‌గా కూడా పవన్‌కు ఆది (Jabardasth Hyper Aadi) వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాడు. దీంతో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాలో ఒక ముఖ్య పాత్రని పవన్ ఇచ్చారు. అంతే కాకుండా.. ఎలాగూ ఆది (Hyper Aadi) రైటర్ కాబట్టి.. ఈ సినిమాలో వచ్చే కొన్ని కామిక్ సన్నివేశాలకు హైపర్ ఆది (Hyper Aadi) తో డైలాగ్స్ రాయిస్తున్నారట పవన్. ఈ ఒక్క సినిమాలోనే కాదు.. ఇక మీదట పవన్ (Pawan Kalyan) చేయబోయే సినిమాలన్నింటిలోనూ హైపర్ ఆది (Hyper Aadi)కి అవకాశం ఉంటుందని టాక్.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!